Honor 200 5G Series : అదరగొట్టిన హానర్.. టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్.. ధర ఎంతో తెలుసా?

హానర్ 200 5జీ 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 34,999, అయితే 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 39,999గా ఉంటుంది.

Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్ ను సంస్థ, భారతదేశంలో లాంచ్ చేసింది. Honor 200 Pro మోడల్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు మరియు 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే వంటి హైలైట్ ఫీచర్‌లతో వస్తుంది. హానర్ 200 మరియు హానర్ 200 ప్రో రెండూ భారతదేశంలో అమెజాన్‌లో అమ్మకానికి వస్తాయి.

హానర్ 200 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.34,999, 12జీబీ ర్యామ్ విత్ 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.39,999 పలుకుతుంది. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ 12జీబీ ర్యామ్ విత్ 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.57,999 పలుకుతుంది.

హానర్ 200 5జీ ఫోన్ బ్లాక్, మూన్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ బ్లాక్, ఓషన్ సియాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటలకు హానర్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, సెలెక్టెడ్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ ప్రైమ్ డే స్పెషల్ ఆఫర్లు

ఈ నెల 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సెల్‌లో భాగంగా హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని కండీషనల్ ఆఫర్లపై రూ.8000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు రూ.8,499 విలువైన హానర్ యాక్సెసరీలు ఉచితంగా లభిస్తాయి.

Honor 200 5G Series

హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫీచర్లు

డిస్‌ప్లే :

  • హానర్ 200 5జీ : 6.7-ఇంచ్ ఫుల్ HD+ OLED కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్.
  • హానర్ 200 ప్రో 5జీ : 6.78-ఇంచ్ ఇంటర్నల్ స్క్రీన్.

ప్రాసెసర్ :

  • హానర్ 200 5జీ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC.
  • హానర్ 200 ప్రో 5జీ : క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్.

కెమెరాలు :

  • 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.
  • 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్.
  •  50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్.
  • హానర్ 200 5జీ: సోనీ IMX906 మెయిన్ సెన్సర్.
  • హానర్ 200 ప్రో 5జీ: H9000 ప్రైమరీ సెన్సర్.
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా; ప్రో మోడల్‌లో 3D డెప్త్ కెమెరా.

బ్యాటరీ మరియు ఛార్జింగ్ :

  • 5,200mAh బ్యాటరీ.
  • 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
  • ప్రో మోడల్: 66W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్.

Honor 200 5G Series

Also Read : BSNL New Customers : బీఎస్‌ఎన్ఎల్‌ నుంచి అదిరిపోయే ప్లాన్స్‌.. భారీగా పెరుగుతున్న కొత్త కస్టమర్లు..!

Comments are closed.