జియో వార్షికోత్సవ ఆఫర్లు, యూజర్లకు అధీరిపోయే ప్రయోజనాలు

ప్రతి సవంత్సరం లాగానే ఈ సారి కూడ రిలయన్స్ తన వినియోగదారులని నిరుత్సాహ పరచకుండ అద్బుతమైన ఆఫర్(ల)ను jio వార్షికోత్సవ రోజున ప్రకటించినది

Telugu Mirror: రిలయన్స్ (Reliance) భారత టెలికాం పరిశ్రమలోకి జియో (Jio) ని ప్రేవేశపెటి 7 సంవత్సరాలు గడిచాయి. ఈ ప్రత్యేక రోజున జియో తన వినియోగదారులకు ఉచిత డేటాతో పాటు అనేక రకాల అదనపు డీల్స్ మరియు డిస్కౌంట్లను అందిస్తోంది. Jio కస్టమర్లు గరిష్టంగా 21GB అదనపు డేటాతో పాటు మరి ఎన్నో ఇతర అద్భుత ఆఫర్లు పొందవచ్చు. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 30, 2030 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా Jio తన వినియోగదారులకు మూడు ప్రత్యేకమైన రీఛార్జ్ డీల్‌  (Recharge Deal) లు అందుబాటులోకి తీసుకువచ్చినది.

జియో రూ. 299 ప్లాన్ బెనిఫిట్స్
ఈ జియో ప్లాన్ ఉపయోగించుకోనే వినియోగదారులుకి  28 రోజుల గడువు ఉంటుంది. ఈ ప్లాన్‌ని ఉపయోగించే వినియోగదారులు ప్రతిరోజూ 2 GB డేటాను వాడవచ్చు. అదనంగా, ఈ ప్లాన్ యొక్క వినియోగదారులు 7 GB డేటాను అందుకుంటారు. అంతే కాకుండా, రోజువారీ 100SMSలు మరియు అపరిమిత వాయిస్ కాల్స్ (Voice Calls) కోసం సదుపాయం కూడ ఉంటుంది.

జియో రూ.749 ప్లాన్ బెనిఫిట్స్
ఈ జియో ప్యాకేజీ ప్లాన్ వచ్చేసి ప్రతి రోజు 2 GB డేటాను అందిస్తుంది. ఫలితంగా జియో కస్టమర్లు 14 GB అదనపు డేటాను అందుకుంటారు. దీనికి అధనంగా రెండు 7GB డేటా కూపన్‌లు (Data Coupons) కూడ ఇవ్వబడతాయి. మరో రూ.90 రీఛార్జ్ తో రోజువారీ 100 ఉచిత SMSలను అందిస్తుంది, అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ సేవను కూడ వినియోగించుకోవచ్చు.

Jio Anniversary Offers are amazing benefits for users
image credit: Trade Brains

Also Read: UPI యూజర్స్ కి గుడ్ న్యూస్, ప్రజల సౌకర్యం కోసం RBI కీలక ప్రకటన

జియో రూ.2999 ప్లాన్ బెనిఫిట్స్
ఈ రిలయన్స్ జియో ప్లాన్ 36 రోజులు లేదా ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్యాకేజీ కింద మీరు ప్రతిరోజూ 2.5 GB డేటాను వినియోగించుకోవచ్చు. అదనంగా, 21 GB అదనపు డేటాను కూడ జియో తన వినియోగదారులుకి ఈ ప్లాన్ లో అందిస్తుంది. ఈ ప్లాన్ కి తోడుగా మరో మూడు 7 GB డేటా కూపన్‌లను జియో తన యూజర్ల (Jio Users) కి ఇస్తుంది . అదనంగా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను పంపించవచ్చు. అదనంగా, AJIO లో కొనుగోళ్లపై రూ. 200 తగ్గింపు, రూ. 800 వరకు నెట్‌మెడ్‌లపై 20% తగ్గింపు, స్విగ్గి (Swiggy) పై రూ.100 తగ్గింపు, రూ.149 కంటే ఎక్కువ కొనుగోళ్లతో ఉచిత మెక్‌డొనాల్డ్ మీల్ (McDonald Meal) మరియు రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) పై 10% తగ్గింపు. అలాగే యాత్ర డాట్‌కామ్ (Yatra.com) ద్వారా విమానా ప్రయాణ టికెట్ బుకింగ్ మీద రూ. 500 మరియు హోటల్ బుకింగ్ పై అత్యధికంగా రూ. 4000 తగ్గింపు పొందవచ్చు.

Leave A Reply

Your email address will not be published.