Telugu Mirror : రిలయన్స్ జియో ఈ నెల 31న కొత్త ల్యాప్ టాప్ విడుదల చేసేందుకు సన్నద్దం అవుతుంది.టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం దిగ్గజ
ఇ – కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) లో విడుదలకు సిద్దంగా ఉన్న రిలయన్స్ జియోబుక్ ల్యాప్ టాప్ టీజర్ ను చూపిస్తుంది. అమెజాన్ లో వెల్లడైన టీజర్ లో ‘యువర్ అల్టిమేట్ లెర్నింగ్ పార్టనర్’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న రాబోయే జియోబుక్ ల్యాప్ టాప్ జూలై 31న ప్రారంభం అవుతుంది.
విడుదల అవుతున్న డివైజ్ గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రారంభం అయిన JioBook యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ అని అనుకుంటున్నారు.JioBook భారత దేశంలో 2022 సంవత్సరంలో రూ.20,000 లోపు ధరలో ప్రారంభం అయింది.దీనిని కేవలం రిలయన్స్ డిజిటల్ స్టోర్ లో మాత్రమే కొనుగోలు దారులకు అందుబాటులో ఉంచారు.
కొత్త JioBook గురించి అమెజాన్ టీజర్ లో కొన్ని వివరాలు బహిర్గతం అయ్యాయి. 2022 లో వచ్చిన జియోబుక్ లాంటి డిజైన్ తో ఉన్నట్లు భావిస్తున్న కొత్త JioBook ల్యాప్ టాప్ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్ అలాగే స్టైలిష్ బ్లూ కలర్ లో ఉంటుంది.
TVS iQube : తక్కువ ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండగా .. ఇంధనం ఖర్చు ఎందుకు దండగా..మీ కోసం అతి త్వరలో..
వయస్సు తారతమ్యం లేకుండా కస్టమర్ లకు డేటా లభ్యత,వినోదంతో పాటు గేమింగ్ మొదలైన సేవలను అందించడానికి జియో బుక్ తయారు చేయబడింది అని అమెజాన్ వివరించింది.కొత్త లాప్ టాప్ 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్,మల్టీ టాస్కింగ్ వివిధ రకాల సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ మేనేజ్ చేయగలిగిన పవర్ ఉన్న ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని కలిగి ఉంటుంది.
టీజర్ లో చూపిన విధంగా రాబోయే Jio ల్యాప్ టాప్ 990 గ్రాముల బరువుతో వెయిట్ లెస్ గా ఉంటుంది.ఇది రోజు మొత్తం బ్యాటరీ లైఫ్ ని కలిగి ఉంటుందని అమెజాన్ క్లెయిమ్ ప్రకారం పబ్లిసిటీ చేయబడింది. అయితే ఇతర ఫీచర్ లు ఇంకా స్పెసిఫికేషన్ ల వివరాలు వెల్లడి కాలేదు.అయితే జూలై 31న జరిగే అధికారిక లాంఛ్ కార్యక్రమంలో JioBook ల్యాప్ టాప్ ని ఆవిష్కరించే అవకాశం ఉంది.
2022 అక్టోబర్ నెలలో విడుదలైన JioBook చదువుకోసం,ప్రైమరీ అవసరాల కోసం మరియు ఇంటర్నెట్ వినియోగం కోసం ల్యాప్ టాప్ అవసరమైన మధ్యశ్రేణి వారికోసం బడ్జెట్ ఆలోచన ఉన్న వినియోగ దారుల కోసం ప్రారంభించారు. దీనిలో 11.6-అంగుళాల HD డిస్ ప్లే కలిగి ఉండి స్క్రీన్ కి,ఫ్రేమ్ కి నడుమ విస్తృతమైన స్పేస్ కలిగిఉంది.క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 SoC ద్వారా Adreno 610 GPU తో జోడించబడింది.2GB RAM మరియు 2- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ కోసం అమర్చబడింది.స్మూత్ మల్టీ టాస్కింగ్ ను సరిపడినంతగా ఉంచుతుంది ఈ ల్యాప్ టాప్.ఇక స్టోరేజ్ పరంగా చూస్తే 32GB eMMC స్టోరేజ్ ని కలిగి ఉంది.దీనిని 128GB వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది.
Reliance Jio:మీకు నచ్చే VIP మొబైల్ నంబర్ కావాలా?..
ఈ ల్యాప్ టాప్ Jio OS తో రన్ అవుతుంది.దీని పనితీరు మృదువుగా ఉండేలా ఆప్టిమైజ్ చేయబడినది.థర్డ్ పార్టీ యాప్ ల ఇన్ స్టాల్ కోసం జియో స్టోర్ కలిగి ఉంది.
ఈ డివైజ్ లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే అత్యధికంగా బ్యాటరీ లైఫ్ 8 గంటలు ఉంటుంది. హీట్ ని ఆపరేట్ చేయడానికి పాసివ్ కూలింగ్ సపోర్ట్ తో వచ్చింది. కనెక్టివిటీల పరంగా 3.5mm ఆడియో జాక్,బ్లూ టూత్ 5.0HDMI మినీ,Wi-Fi తోపాటు ఇంకా ఉన్నాయి.ప్రధానంగా ఈ ల్యాప్ టాప్ ఎంబెడెడ్ Jio Sim తో వచ్చింది.దీనిని వినియోగించే వారు Jio 4G LTE కనెక్టివిటీని వాడుకునేలా చేస్తుంది.