Lava O2 : లావా 02 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీన్ని కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతోపాటు ఈ ఫోన్ డిజైన్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ మనదేశంలో రాబోయే కొన్ని వారాల్లో లాంచ్ కానుంది. ప్రముఖ ఇ కామర్స్ వెబ్ సైట్ అయినా అమెజాన్‌లో దీనిని కంపెనీ లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఇందులో రివీల్ అయ్యాయి.
అమెజాన్ ల్యాండింగ్ పేజీ ఈ హ్యాండ్‌సెట్ గురించి కొంత డేటాను వెల్లడించింది. ఈ ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఫోన్ ముందు భాగం పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో వెనుక AG గ్లాస్ ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ Octa కోర్ Unisoc T616 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రానుంది. ఈ ఫోన్ లో 50MP AI ట్విన్ కెమెరాలు ఉన్నాయి అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
LAVA O2 ఆకుపచ్చ మరియు ఊదా రంగులలో వస్తుంది, వెనుక భాగంలో యాంటీ గ్లేర్ గ్లాస్ ఉంటుంది. దీనిలో ఉండే డ్యూయల్ కెమెరా సెటప్ వివిధ కోణాల నుండి చూసినప్పుడు దాని రూపాన్ని మారుస్తుంది. ఫోన్ వెనుక ప్యానెల్ మూలలో కంపెనీ లోగోను కలిగి ఉంటుంది. ఇది టైప్-సి పోర్ట్ మరియు స్పీకర్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. Lava O2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
లావా ఇటీవల భారతదేశంలో తన కొత్త బ్లేజ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్ కర్వ్ 5 జిని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 64MP కెమెరా, 6.67-అంగుళాల 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 7050 SoC మరియు 5,000 mAh బ్యాటరీతో సహా అనేక రకాల ఫీచర్లతో వచ్చింది. ఇది భారతదేశంలో ప్రారంభించిన వారంలోపు కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.
Lava O2