Moto G64 5G : ప్రపంచంలోనే మొట్టమొదటి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్ సెట్ తో భారత్ లో ఏప్రిల్ 16న లాంఛ్ అవుతున్న Moto G64 5G ఫోన్.

Moto G64 5G :ప్రసిద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola నుంచి మరో కొత్త 5G ఫోన్ విడుదల అవుతుంది. Moto G64 5G గా పిలువబడే ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 16న భారతదేశంలో విడుదలకు సిద్దంగా ఉన్నట్లు కంపెనీ అధికారికంగా X లో ప్రకటించింది.

Moto G64 5G : మోటరోలా తన తాజా స్మార్ట్ ఫోన్ Moto G64 5G ఇండియా లాంచ్ డేట్ ని నిర్ధారణ చేసింది. ఈ ఫోన్ G-సిరీస్‌లో తాజాగా వచ్చిన Motorola ఫోన్ Moto G54 5G ద్వారా అప్‌గ్రేడ్ చేయబడుతుంది. లాంచ్ డేట్‌తో పాటు, Moto G64 5G స్పెసిఫికేషన్‌లు, డిజైన్ మరియు రంగులు వెల్లడయ్యాయి. రాబోయే Moto G64 5G గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్ లో Moto G64 5G విడుదల తేదీ మరియు లభ్యత:

ఏప్రిల్ 16న భారత్ లో Moto G64 5G విడుదల అవుతుంది. ఈ విషయాన్ని Moto X వీడియో ద్వారా ప్రకటించింది. ఫోన్ విడుదల మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమవుతుంది. మోటరోలా విడుదల చేస్తున్న Moto G64 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా యొక్క ఇ-స్టోర్ మరియు అన్ని ప్రధాన రిటైలర్‌లలో విక్రయించబడుతుందని కంపెనీ పేర్కొంది.

Moto G64 5G స్పెసిఫికేషన్స్:

Moto G64 5G : World's first MediaTek Dimension 7025 chip set
image Credit : Telugu Mirror

Moto G64 5G స్పెక్స్ ధృవీకరించబడ్డాయి
Moto G64 5G 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో 6.5-అంగుళాల FHD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది MediaTek డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తుంది. ఇది ప్రపంచంలోనే 7025 ప్రాసెసర్ తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్. Moto G64 5Gలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 8MP మాక్రో డెప్త్ సెన్సార్ ఉంటాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Moto G64 5G ఫోన్‌ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ లేదా 12GB RAM మరియు 256GB నిల్వ సామర్ధ్యంతో విడుదల అవుతుంది. మైక్రో SD కార్డ్ తో 24GB వరకు పొడిగించిన RAM ఫోన్‌తో వస్తుంది. అదేవిధంగా 1TB వరకు నిల్వ సామార్ధ్యాన్ని విస్తరించవచ్చు. 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఫోన్ Android 14తో రన్ చేయబడుతుంది. ఇది Android 15 మరియు మూడు సంవత్సరాల భద్రతా అప్ డేట్ లకు హామీ ఇస్తుంది. Moto G64 5G డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు, IP52 వాటర్ రెసిస్టెన్స్ మరియు My UX సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది.

Moto G64 5G లుక్స్, కలర్స్ మరియు అంచనా ధర:

Moto G64 5G కర్వ్డ్ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పెద్ద బెజెల్స్‌తో, ఫోన్ మందంగా కనిపిస్తుంది. ఇది మింట్ గ్రీన్, పెరల్ బ్లూ మరియు ఐస్ లిలక్ రంగులలో వస్తుంది. Moto G64 5G రూ.20,000 లోపు ధరలో లభిస్తుందని భావిస్తునారు.

Moto G64 5G

Comments are closed.