Motorola G64 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో విడుదల అయింది. అయితే రెండు నెలల తర్వాత, ఇప్పుడు ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మెరుగైన స్పెక్స్ మరియు డిజైన్‌ను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Motorola G64 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 13999 లభించనుంది. ఒకవేళ, మీరు మీ SBI క్రెడిట్ కార్డ్, ICICI బ్యాంక్ లేదా యాక్సెస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 5% తగ్గింపును అందిస్తుంది.
Motorola G64 5G స్మార్ట్‌ఫోన్ f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF)ని అందిస్తుంది. ఇది f/2.2 ఎపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ లెన్స్ మాక్రో ఫోటోలను కూడా తీయగలదు. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.
Also Read: Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ నుండి కొత్త వేరియెంట్ లాంచ్.. ఫీచర్స్ చూస్తే అదుర్స్..!
ఈ ఫోన్ 33W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6000mAh బ్యాటరీ (Battery) ని కలిగి ఉంది. మోటో యొక్క కనెక్షన్ 5G, 4G LTE, WiFi, బ్లూటూత్ 5.3, NFC, GPS మరియు USB-C ఛార్జింగ్ కనెక్టర్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. IP52 సర్టిఫికేషన్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ (Water Resistant) గా లాంచ్ చేయడం జరిగింది. మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ బరువు 192 గ్రాములు ఉంది.
Motorola G64 5G స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ (Refresh Rate) ను కలిగి ఉంది. డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ Motorola స్మార్ట్‌ఫోన్ MediaTek Dimension 7025 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ (Android 14 Operating System) పైన రన్ అవుతుంది. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ మరియు 12GB RAM + 256GB స్టోరేజ్ వంటి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.