Flip Kart Big Savings Day: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డే లో కిర్రాక్ డిస్కౌంట్ లలో Motorola స్మార్ట్ ఫోన్ లు

Telugu Mirror: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా(Motorola) ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart)బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Motorola తన ఉత్పత్తులైన Moto Edge, Moto G, Moto E సిరీస్ లోని స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్‌లు, డిస్కౌంట్ లను ప్రకటించింది.

బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ జరిగే సమయంలో కొనుగోలుదారులు తమకు నచ్చిన మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరలలో పొందవచ్చు. ఆగస్టు 4 నుంచి ఆగస్టు 9 వరకు సేవింగ్స్ డేస్ సేల్ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని motarola ఆఫర్‌లు ఇక్కడ ఉన్నాయి.

Also Read:ఆగష్టు 9న FlipKart లో అమ్మకానికి Poco M6 Pro 5G ధర స్వల్పం..ఫీచర్లు అత్యధికం

motorola mobiles available in good budget with flip kart offer
image credit:91mobiles.com

మోటరోలా ఎడ్జ్ సిరీస్:

Motorola Edge Series, Motorola Edge 40, Motorola Edge30 Ultra ఇప్పుడు డిస్కౌంట్ ధరలలో పొందేందుకు ఉన్నాయి. Motorola Edge 40 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో కలిగి ఉండి Ingress Protection 68( IP68) రేటింగ్ కలిగిన వాటర్ రెసిస్టెన్స్ పవర్ తో ప్రపంచంలోనే అత్యంత స్మార్ట్ 5G ఫోన్.

Also Read:దేశీ బ్రాండ్..ఫోన్ గ్రాండ్ రిలీజ్ Lava Yuva 2 బడ్జెట్ ఫోన్ ఇప్పుడు భారత్ లో

ఎడ్జ్ లైటింగ్ (6.55-inches pOLED HDR10+)తో సెగ్మెంట్-లీడింగ్ 144Hz 3D వంపు కలిగిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. OISతో 50- మెగా పిక్సెల్ 360 డిగ్రీల కోణంలో రొటేట్ అవగల హారిజోన్ లాక్ కెమెరా వంటి అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తయారుచేసిన ఫీచర్‌లతో వస్తుంది.మోటరోలా ఎడ్జ్ 40 ధర రూ. 27,999 లో అందుబాటులో ఉంది.

Motorola Edge 30 Ultra ఫోన్ 12GB RAM, 256GB నిల్వ సామర్థ్యం మరియు 200 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 42,499 కు లభిస్తుంది. Motorola G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల క్రింద బ్రాండ్ చేయబడిన Moto g32 8GB RAM, 128GB స్టోరేజి కలిగి 1TB వరకు విస్తరించుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 10,999 పొందవచ్చు.

ఈ ఫోన్‌లోని కొన్ని ఫీచర్స్ ని గమనిస్తే 90Hz 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు, నియర్-స్టాక్ ఆండ్రాయిడ్ 12, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ మరియు 50 మెగా పిక్సెల్ క్వాడ్-ఫంక్షన్ కెమెరా ఉన్నాయి. Moto G 62 ఫోన్ కూడా రూ. 13,999 తగ్గింపు ధరతో లభిస్తుంది.

5G కనెక్టివిటీ కోసం భారతదేశం లో 5G బ్యాండ్‌లతో సహా 12 5G బ్యాండ్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మృదువైన 120Hz డిస్‌ప్లే, Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌ని కలిగి వచ్చింది.

Motorola e సిరీస్ వివరాలు:

Moto e13 ఫోన్ 5000mAh బ్యాటరీతో లభిస్తుంది. 4GB RAM + 64GB నిల్వ సామర్థ్యం కలిగిన డివైజ్ ధర రూ. 7,299, 2GB RAM + 64GB స్టోరేజ్ కలిగి ఉన్న పరికరం ధర రూ.5,849 లో లభిస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in