Nothing Phone 2 : నథింగ్​ ఫోన్​ 2 ప్రీ ఆర్డర్స్​ షురూ.. పూర్తి వివరాలు ఇవే!

Telugu Mirror: Nothing Phone 2 జూలై లో విడుదలకానుంది, దీంతో పాటు Nothing Phone 2 గురించి కొన్ని స్పెసిఫికేషన్ లు లీక్ అయ్యాయి. అవేంటో చూద్దాం.పోయిన సంవత్సరం జులైలో Nothing Phone 1 విడుదల అయ్యింది. అలానే ఈ సారి కూడా కంపెనీ జూలైలోనే Phone 2 ను రిలీజ్ చెయ్యాలని అనుకుంటుంది. Nothing Phone 2 యొక్క డిజైన్ మరియు కొన్ని స్పెసిఫికేషన్ లను కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Nothing Phone 2 జూలై 10వ తారీకున విడుదల కానుంది.టిప్ స్టర్ అయిన యోగేష్ బ్రార్ చెప్పినదాన్ని ప్రకారం Nothing Phone 2 రూ.40,000 నుంచి రూ.43,000 వరకు ఉండవచ్చు. ఫ్లిఫ్ కార్ట్ లో ఇప్పటికే Nothing Phone 2 యొక్క ప్రీ ఆర్డర్ లు మొదలయ్యాయి.

Telugu Panchangam: మిర్రర్ తెలుగు న్యూస్ ఈరోజు 07 జూలై 2023 తిథి, పంచాంగం.

Nothing Phone 2 120Hz రిఫ్రెష్ రేట్ కూడిన 6.7-inch full HD + డిస్ ప్లే తో తీసుకురానుంది. అలానే Nothing 2 OLED డిస్ ప్లే మరియు 2400 x 1080 పిక్సెల్స్ రెజల్యూషన్ ను కలిగి ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్స్ లలో Nothing Phone 2 లభిస్తుంది, వైట్ మరియు డార్క్ గ్రే లేదా బ్లాక్ వంటి రెండు కలర్ లలో అందుబాటులోకి రానుంది. Nothing Phone 1 తొ పోలిస్తే Phone 2 80 శాతం మెరుగ్గా కనిపిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈసారి Nothing Phone 2 Qualcomm Snapdragon 8+ Gen(1) SoC చిప్ సెట్ తో రాబోతుంది. పోయిన సారి కంటే ఎక్కువ మోడిఫికేషన్ లు Phone 2లో మనం చూస్తామని కంపెనీ తెలిపింది.

ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 మరియు Nothing OS 2 పైన నడుస్తుంది. ఈ ఫోన్ మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ మరియు నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. కెమెరా గురించి చూసినట్లయితే 50MP + 50MP డ్యుయల్ కెమెరా ప్యాట్రన్ ను ఫాలో అవుతుంది. 50- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా (OIS) Sony IMX890 సెన్సార్ తో రాబోతుంది. అలానే మరో 50- మెగా పిక్సెల్ కెమెరా Samsung ISOCELL JN1 సెన్సార్ తో రాబోతుంది. అల్ట్రా వైడ్ ఫోటోలు ఈ కెమెరా తో తియ్యవచ్చు.

Pakistan : వైరల్ అవుతున్న పాకిస్థానీ స్లాప్ కబడ్డీ..

32- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ హ్యాండ్ సెట్ కలిగి ఉంటుంది.Nothing Phone 2, 4,700mAh బ్యాటరీ ను కలిగి ఉంటుంది. అలానే ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 18W వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం Nothing Phone 2 యొక్క సమాచారం ఇది మాత్రమే. ఫోన్ యొక్క ఎన్నో స్పెసిఫికేషన్ లు ఇంకా తెలియలేదు, జూలై 10 న ఈ ఫోన్ విడుదలకు సిద్దమవుతుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in