Telugu Mirror : నథింగ్ కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ (2) గత సంవత్సరం విడుదలైన నథింగ్ ఫోన్ (1) కి సక్సెసర్ గా ఇటీవల విడుదల అయ్యింది.Carl Pei నథింగ్ ఫోన్ (2) కూడా గతంలో వచ్చిన స్మార్ట్ ఫోన్ లాగానే ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేకమైన గ్లిఫ్ ఇంటర్ ఫేస్ తోనే వస్తుంది అలాగే నథింగ్ ఫోన్ (2) , నథింగ్ కంపెనీ స్వంత కస్టమ్ నథింగ్ OS 2.0 మీద రన్ అవుతుంది.
నథింగ్ ఫోన్ (2) స్మార్ట్ ఫోన్ భారత దేశంలో జూలై 21 నుంచి FlipKaart ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి.ఈ స్మార్ట్ ఫోన్ భారత దేశ ప్రారంభ ధర రూ.44,999గా నిర్ణయించబడింది. నథింగ్ ఫోన్ (2) స్మార్ట్ ఫోన్ ని మీరు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే నథింగ్ ఫోన్ (2) గురించి ఈ సమాచారాన్ని తెలుసుకోండి.
60 రోజులు సముద్రంలో చిక్కుకున్న సెయిలర్..తోడుగా కుక్క మాత్రమే..
నథింగ్ ఫోన్ (2) సాఫ్ట్ వేర్:
నథింగ్ ఫోన్ (2) ప్రాసెసర్ లో అప్ డేట్ తో వస్తుంది. ఇది నథింగ్ ఫోన్ (1)కన్నా మెరుగుగా ఉంటుంది. నథింగ్ (2) స్మార్ట్ ఫోన్ Qualcomm స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ లు అడ్రినో 730 GPUతో జోడించబడినవి.ఇవి ఎంతో వేగవంతమైనవి.ఇవి నథింగ్ ఫోన్ (2) యొక్క పనితీరులో 80 శాతం పెంపుదలను కలిగిస్తాయి అని కంపెనీ తెలిపింది.నథింగ్ ఫోన్ (2)-నథింగ్ OS 2.0 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తుంది.ఇది మీ ఫోన్ యొక్క చర్యలను, శ్రద్దగా నడిపేలా పనిచేస్తుంది.
నథింగ్ ఫోన్ (2) కెమెరా పనితీరు:
నథింగ్ ఫోన్ (2) వెనుక వైపున డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా Sony IMX 890 సెన్సార్ తో
f/1.88 ఎఫెర్చర్ కలిగిఉంటుంది.సెన్సార్ యొక్క సైజ్ 1/1.56-అంగుళాలు. ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS ) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)మద్దతు కలిగ ఉంటుంది. అదేవిధంగా మరికొన్ని ఇతర ఫీచర్లు మోషన్ ఫోటో,సూపర్-రెస్ జూమ్,AI సీన్ డిటెక్షన్, ఎక్స్ పర్ట్ మోడ్ మరియు డాక్యు మెంట్ మోడ్ ను కలిగి ఉంటుంది.
50MP f/2.2 Samsung JN1 సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో EISకి మద్దతు కలిగి 114-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ తో నథింగ్ ఫోన్ (2)లోని రెండవ ప్రైమరీ కెమెరా ఉంటుంది.నథింగ్ ఫోన్ (2) లో Sony IMX 615 సెన్సార్ తో f/2.45 ఎపర్చర్ మరియు f/2.74-అంగుళాల సెన్సార్ పరిమాణం కలిగి సెల్ఫీలు మరియు వీడియోకాల్స్ కోసం అద్భుత మైన 32MP కెమెరా కలిగి ఉంటుంది.
ToDay Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు మంగళవారం, జూలై 18, 2023 తిథి ,పంచాంగం
నథింగ్ ఫోన్ (2) డిస్ ప్లే మరియు బ్యాటరీ:
నథింగ్ ఫోన్ (2)LTPO డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.7- అంగుళాల ఫుల్ HD+ OLED స్క్రీన్ అత్యధికంగా 1600 నిట్ ల ప్రకాశవంతంగా (బ్రైట్నెస్) ఉంటుంది.హ్యాండ్ సైట్ 45W PPS చార్జింగ్ తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.PPS ఛార్జింగ్, ఫోన్ ను 55 నిమిషాలలో 0 నుంచి 100 వరకు తీసుకువెళుతుంది. కంపెనీ అదనంగా హ్యాండ్ సెట్ కు 15W Qi వైర్ లెస్ ఛార్జింగ్ మద్దతును కూడా కల్పించింది.
నథింగ్ ఫోన్ (2) ధర మరియు రంగులు:
నథింగ్ ఫోన్ (2) మూడు మోడల్ లలో లభిస్తుంది. బేస్ మోడల్ 8GB RAM తో 128GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది.దీని ధర రూ.44,999.ఇతర మోడల్స్ లో 12GB +256GB మరియు 12GB + 512GB స్టోరేజ్ సామర్ధ్యాన్ని కలిగి వరుసగారూ. 49,999 మరియు రూ.54,999 ధరలలో లభిస్తాయి. Axis బ్యాంక్ మరియు HDFC బ్యాంక్ ల డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ లను ఉపయోగించడం ద్వారా ‘లాంఛ్ ఆఫర్’ క్రింద తక్షణ తగ్గింపు రూ.3,000 వరకు ఉంటుంది.నథింగ్ ఫోన్ (2) డివైజ్ వైట్ మరియు డార్క్ గ్రే కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.