Ola S1 Air:ఆకట్టుకునే ధర , ఆకర్షణీయమైన ఫీచర్స్ తో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మీ కోసం..

Telugu Mirror : Ola భారత దేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరంపరలో కంపెనీ నుంచి మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ S1ఎయిర్ అమ్మకాలకు తెర తీసింది.ఎలక్ట్రిక్ వెహికిల్ Ola సంస్థ వాస్తవానికి షెడ్యూల్ తేదీ ప్రకారం జూలై 28 కానీ ఒకరోజు ముందుగానే దాని కొనుగోలుకు ద్వారాలు తెరిచింది.బుకింగ్ ఆఫర్ తెరచిన కొద్ది గంటలలోనే 3000 కంటే ఎక్కువ యూనిట్లు బుక్ అయ్యాయని,ఎలక్ట్రిక్ వాహనానికి స్పందన ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నదని Ola పేర్కొన్నది.Ola S1ఎయిర్ ను ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వారికి ప్రస్తుతం రూ.1.09లక్షల (X షో రూమ్) ధరకు అందుబాటులో ఉంటుంది.ఆ తరువాత ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.10,000 అదనం అవుతుంది.
భవీష్ అగర్వాల్ Ola ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు మరియి CEO సోషల్ మీడియా ద్వారా తన స్పందనను ఈ విధంగా తెలిపారు.S1ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొనుగోలు విండోస్ తెరవగానే మొదటి గంటలోనే 1,000 యూనిట్ లు బుక్ అయ్యాయని,మూడు గంటలలో 3,000 యూనిట్ ల EV లను క్లాక్ చేసారని మరో అప్ డేట్ లో తెలిపాడు.

Desi Ghee : బ్యూటీ పార్లర్ కి వద్దు..దేశీ నెయ్యి ముద్దు.. చర్మం నిగారింపు ఇప్పుడు నెయ్యితో?

అంతకు ముందే కంపెనీ కమ్యూనిటీ సభ్యుల కోసం ఒకరోజు ముందుగానే S1ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు విండోను తెరచింది ఓలా ఎలక్ట్రిక్.కొనుగోలు విండో తెరవాలని అనుకున్న తేదీకి ఒకరోజు ముందే అనగా జూలై 27 2023 న లైవ్ టెలీకాస్ట్ లో భావిష్ అగర్వాల్ డెవలప్ మెంట్ గురించి ప్రకటించారు.Ola ఎయిర్ స్కూటర్ S1ప్లాట్ ఫారమ్ పైనే వస్తుంది.ఏదేమైనా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఖర్చు తగ్గింపు ఫీచర్ లను కలిగి ఉంటుంది.చిన్న 3kWh బ్యాటరీని కలిగి ఉంది.అలాగే ఒక్కసారి ఛార్జ్ తో 125 కిలోమీటర్లు వస్తుంది.

Image credit: Ht Tech

S1ఎయిర్ 4.5kw (6bhp )హబ్ మోటార్ నుండి పవర్ ని పొందుతుంది..S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 0 నుంచి 40 కిలోమీటర్లు/అవర్ స్పీడ్ ను అందుకోగలదని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.7

Trans Gender : ట్రాన్స్ జెండర్స్ కి రిజర్వేషన్ లోటు.. వివక్షతని అరికట్టి పౌరసత్వాన్ని నిలబెడతారా? 

Ola S1 ఎయిర్ EV ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ లైన Ather 450S మరియు TVS iQube వంటి EV లకు ప్రత్యర్ధిగా ఉంటుంది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ కలిగి ఉంటుంది.అలాగే వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ తోపాటు రెండు వైపులా డ్రమ్ బ్రేక్ లతో వస్తుంది. Ola నూతన S1 ఎయిర్ న్యూ నియాన్ గ్రీన్ పెయింట్ స్కీమ్ అలాగే యుటిలిటేరియన్ గ్రాబ్ రైల్ కలర్స్ లో లభిస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in