Telugu mirror : స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాధాన్యత కలిగిన వస్తువు.మానవ సంభంధాలకన్నా స్మార్ట్ ఫోన్ పై ఉన్న బంధానికే విలువ చూపుతున్న కాలం ఇది. పగలు,రాత్రి,ఎండా,వాన,నిద్రా,మెలకువ ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా చేతిలో,లేదా హ్యాండ్ బ్యాగ్ లో,షర్ట్ జేబులో ఎక్కడ ఉన్నా,ఏం చేస్తున్నా స్మార్ట్ ఫోన్ వుండాల్సిందే.ఫోన్ ని విడిచి ఉండలేని ఇంకొందరు ఏకంగా స్మార్ట్ ఫోన్ ని టాయిలెట్ లోకి తీసుకు వెళుతున్నారు.తాజాగా వెలుగు చూసిన అంశం ఏంటంటే ప్రతి పది మంది స్మార్ట్ ఫోన్ యూజర్ లలో ఆరుగురు తమ ఫోన్ లను టాయిలెట్ కు తీసుకు వెళుతున్నారని తాజాగా జరిగిన అధ్యయనం లో వెలుగు చూసింది.
Toy Business : ఇంట్లోనే ఉంటూ సంపాదించే ఛాన్స్.. సొంత వ్యాపారమే హాయి..
అయితే ఈ అలవాటు తీవ్రమైన అనారోగ్య కారణాలకు కారణమవుతుంది.NordVPN నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.ఫోన్ లను టాయిలెట్ కు తీసుకు వెళ్ళడానికి గల కారణాలు కూడా చిత్రం గా ఉన్నాయి.అధ్యయనం లో పాల్గొన్న వారిలో 61.6 శాతం మంది facebook,ట్విట్టర్ మరియు ఇన్ స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా వేదికలను చూసేందుకు స్మార్ట్ ఫోన్ లను వాష్ రూమ్ కు కూడా తీసుకెళుతున్నట్లు తెలిపారు. 33.9 శాతం మంది స్మార్ట్ ఫోన్ వాడకందారులు కరెంట్ అఫైర్స్ ను తెలుసుకోవడానికి టాయిలెట్ లో ఫోన్ లను వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు.
4.5 శాతం మంది తాము టాయిలెట్ నుండి మెసేజ్ లు అలాగే కాల్ చేయడానికి ఫోన్ ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎక్స్ పర్ట్, డాక్టర్ హ్యు హేడెన్ Yahoo Life UK తో సంభాషిస్తూ,వాష్ రూమ్ సీట్ల కంటే స్మార్ట్ ఫోన్ లు క్రిములను పదిరెట్లు అధికంగా పెంచగలవని చెప్పారు. టచ్ స్క్రీన్ లు అంటువ్యాధులను మోసుకు వెళ్ళే వాహకాలుగా పనిచేస్తాయని, ప్రస్తుత ‘డిజిటల్ యుగంలోని మస్కిటో’ లుగా స్మార్ట్ ఫోన్ లను అభివర్ణించాడు.డాక్టర్ హైడెన్ మాట్లాడుతూ “మనం భాగస్వామ్య పై భాగాలను తాకినప్పుడు,మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ని ఉపయోగించినప్పుడు ఒకదాని ద్వారా మరొక దానికి సంక్రమణ జరిగి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది.అప్పుడు ఫోన్ కూడా ఇన్ఫెక్షన్ లకు ప్రధాన కారణంగా మారుతుంది అని చెప్పారు.”
Yahoo Life UK పరిశోధనా నివేదిక ప్రకారం,సూక్ష్మ క్రిములు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద 28 రోజులవరకు బ్రతికుండగలవు. ఈ క్రిములు టచ్ స్క్రీన్ ఫోన్ లను సూక్ష్మ క్రిములు,పాథో జెన్ లకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుస్తాయి.గతంలో జరిగిన పరిశోధనలలో వెలువడిన అంశాలలో ఫోన్ లలో స్టెఫీలో కాకస్ సాధారణంగా కనిపించే వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిములలో కొన్ని అని పేర్కొన్నారని,వ్యాధులను కలిగించే ఈ క్రిములు నోరు,కళ్ళు మరియు ముక్కుతో కలవడం ద్వారా శరీరం లోకి ప్రవేశిస్తాయని వాటివలన శ్వాసకోశ,చర్మ వ్యాధుల తో పాటు వివిధ అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ప్రస్తుత నివేదికలో పేర్కొన్నారు.
Panchang : నేటి పంచాంగం.. 03 జూలై 2023 వివరాలు తెలుసుకోండి..
ఇప్పటికే మీకు అలవాటు ఉంటే: టాయిలెట్ లో స్మార్ట్ ఫోన్ లను వాడటం వలన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కు జెర్మ్స్ అలాగే వ్యాధులను వ్యాపింప జేసే క్రిములను అధికం అవుతాయి.కాబట్టి వాష్ రూమ్ కు ఫోన్ ను తీసుకు వెళ్ళకుండా ఉండటం ఎంతో మంచిది.