ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. అత్యాధునిక సాంకేతికత (technology) అనేది సామాన్య మానవులకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు గానీ, స్కామర్లు మాత్రం టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు.
ప్రజలకు (the people) అవగాహన లేని విధానాలలో బాగానే బురిడీ కొట్టించి మరీ కుచ్చు టోపి పెడుతున్నారు.
ఆన్ లైన్ లోనే ప్రజల బ్యాంక్ అకౌంట్ (Bank account) లను ఖాళీ చేస్తున్నారు.
మరి ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికమైనప్పటి నుండి ప్రజలను బాగా మోసం చేస్తున్నారు. స్పామ్ కాల్ (Spam call) ద్వారా, మెసేజ్ ల ద్వారా, ఆన్ లైన్ జాబ్ (Job) పేరిట ఇలా రకరకాల పద్ధతులను ఉపయోగించి ప్రజలను ఫ్రాడ్ చేసేవాళ్లు విపరీతంగా పెరిగి పోతున్నారు.
Also Read : Apple iPhone15 : ఇప్పుడు రూ.12,000 తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 15 ను Amazon India లో పొందండి. వివరాలివిగో
మెసేజ్ లు పంపించే లింకులు ద్వారా మొత్తం బ్యాంక్ ఖాతాలను (Bank accounts) హ్యాక్ (Hack) చేస్తున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే స్పామ్ కాల్స్ ఫ్రాడ్ మెసేజ్ ల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.
నిపుణుల నుండి సేకరించిన అంశాలను తెలుసుకోవడం ద్వారా స్కామర్ల వలలో చిక్కు కోకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
అయితే కొన్ని రకాల టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే జాగ్రత్తగా మాట్లాడాలి. అవతల వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదు.
మీకు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఫోన్ చేసినవారు చట్టబద్ధమైన (Legal) వారా? కాదా ?అని నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలను వారిని అడగాలి. అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది.
ఫోన్ లో పాస్ వర్డ్ లేదా ఆర్థిక వివరాలు (Financial details), ఒటిపి (OTP) లు మరియు పర్సనల్ డేటా వంటి వివరాలను చెప్పకూడదు.
కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తే సమాధానం చెప్పేముందు ఆలోచించి మాట్లాడాలి. దీనిని వాయిస్ మెయిల్ కి వెళ్ళ నివ్వాలి.
రెడ్ ఫ్లాగ్ (Red flag) ల కోసం చూడాలి. అయాచిత ఆఫర్లు లేదా డబ్బుల కోసం అత్యవసర అభ్యర్థులు వంటి సంభావ్య (Probable) స్కామ్ సంకేతాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
స్కామర్లు ఒత్తిడి (stress) తో కూడిన పన్నాగా లను ఉపయోగిస్తారు. అనగా ఈరోజు ఇది క్లైమ్ చేయకుంటే మీరు ఈ ఆఫర్ ను పోగొట్టుకుంటారు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అనుమానం వస్తే కాలర్ ఇచ్చిన నంబర్ కు బదులుగా అధికారిక సంప్రదింపు (Official contact) నెంబర్ ను ఉపయోగించి డైరెక్ట్ గా కంపెనీ లేదా సంస్థతో సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలి.
కాల్ బ్లాకింగ్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల స్కామ్ కాల్ ను గుర్తించి, బ్లాక్ (Block) చేయడం సులభతరం అవుతుంది.
బెదిరింపులను తెలివిగా గుర్తించడానికి మోసగాళ్లు ఉపయోగించే సాధారణ స్కీమ్ లు, వ్యూహా (strategy) ల గురించి, ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఫోన్ చేసిన వ్యక్తితో సన్నిహితంగా (intimately) ఎప్పుడూ మాట్లాడకూడదు.
కాబట్టి ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టవచ్చు. తద్వారా మోస గాళ్ల (Fraudsters) వలలో పడకుండా ఉంటాము.