OPPO Find N3 Flip : ఒప్పో నుంచి ట్రిపుల్ కెమెరాలతో ఫైండ్ ఎన్ 3 ఫ్లిప్​ ఫోన్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే ఫిదానే

oppo-launches-new-foldable-smartphone-find-n3-flip-in-india

Telugu Mirror : భారతదేశంలో Oppo ఎట్టకేలకు Find N3 ఫ్లిప్‌ను విడుదల చేసింది. కంపెనీ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Find N2 ప్రేరణతో  కొత్త మోడల్‌ Find N3 ఫ్లిప్‌ తయారు చేయబడింది. Find N3 ఫ్లిప్‌ ఫోన్ మునుపటి ఫోన్ల కంటే ఎక్కువ ఫీచర్స్ తో వచ్చింది. Find N3 ఫ్లిప్‌ ఫోన్  కవర్ స్క్రీన్ ఇప్పుడు Gmail, WhatsApp మరియు  40 అదనపు యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. అదనంగా Find N3 ఫ్లిప్ ఫోన్  అనేది టెలిఫోటో లెన్స్‌ కలిగిన ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉన్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్.

Also Read :World Egg Day : గుడ్డు తో కలిపి తినకూడని పదార్ధాలు మీకు తెలుసా?

Oppo Find N3 ఫ్లిప్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ :

1080 x 2520 పిక్సెల్‌ల అద్భుతమైన రిజల్యూషన్‌ని అందిస్తూ అద్భుతమైన 6.8-అంగుళాల FHD ప్రైమరీ డిస్‌ప్లేతో కూడి ఉన్నది. Oppo Find N3 Flip నిజంగా ఆకర్షణీయంగా ఉంటుంది. AMOLED స్క్రీన్ మరియు  స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, ఫోన్ కు మరింత భద్రతను అందిస్తుంది. MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌సెట్ ఆక్టా- కోర్ ప్రాసెసర్ (Processor)  ద్వారా Oppo Find N3 ఫ్లిప్‌ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. 128 GB RAM కలిగి ఉన్న Oppo Find N3 చాల వేగవంతమైన అనుభూతిని  అందిస్తుంది.

oppo-launches-new-foldable-smartphone-find-n3-flip-in-india

Oppo Find N3 ఫ్లిప్‌ ఫోన్  కెమెరా విషయానికి వస్తే ఈ అద్భుతమైన ట్రిపుల్ బ్యాక్ కెమెరా కాన్ఫిగరేషన్‌ని మీకు అందించడానికి Oppo మరియు Hasselblad భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇక ఈ ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్​లో 50ఎంపీ ప్రైమరీ, 32ఎంపీ టెలిఫొటో, 48ఎంపీ అల్ట్రవైడ్​ రేర్​ కెమెరా వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సైతం లభిస్తోంది. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత కలర్​ఓఎస్​ 13.2 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 4ఏళ్ల పాటు సాఫ్ట్​వేర్​ అప్డేట్స్​ ఇస్తామని సంస్థ చెబుతోంది.

Also Read : Google Chrome ఉపయోగించే వారికి హై – రిస్క్ వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం. మీ డివైజ్ ను ఎలా రక్షించాలో తెలుసుకోండి

సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మీ ఫోన్ భద్రంగా ఉంటుంది. ఈ సేఫ్టీ ఫీచర్ మీ ఫోన్ ను  సురక్షితంగా ఉండేలా చేస్తుంది మరియు సులభంగా యాక్సెస్  చేయడానికి వీలుగా ఉంటుంది. ఇండియా మార్కెట్​లోకి గురువారం లాంచ్​ అయిన ఈ ఒప్పో ఫైండ్​ ఎన్​3 ఫ్లిప్ ధర రూ. 94,999గా ఉంది. స్లీక్​ బ్లాక్​, క్రీమ్​ గోల్డ్​ కలర్స్ లో Oppo Find N3 ఫ్లిప్‌ ఫోన్ లు ​లభిస్తున్నాయి. అక్టోబర్​ 22 నుంచి Oppo Find N3 ఫ్లిప్‌ ఫోన్​ సేల్స్​ మొదలవుతాయి .

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in