చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ అయిన Poco, దాని కొత్త ఫోన్ Poco M6 Pro 5Gని ఆగస్ట్ 9న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విడుదల చేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 ఆధారంగా పనిచేస్తుంది. Android 13-ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది. మరియు రెండు ప్రధాన OS అప్‌డేట్‌లకు హామీ ఇస్తుంది. డ్యూయల్-కెమెరా యూనిట్ లో 50MP AI సెన్సార్ ఉంది మరియు 5,000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. IP53 సేఫ్టీ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ఫోన్ యొక్క ఫీచర్లు ఫోన్ యొక్క క్వాలిటీ ని మెరుగుపరుస్తాయి.
Poco M6 Pro 5G: ధర
భారతదేశంలో ఆగష్టు 9వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12PM నుండి Poco M6 Pro 5G ప్రత్యేకంగా Flipkart లో అందుబాటులో ఉంటుంది. Poco స్టోరేజ్ మరియు RAM కోసం రెండు ఆప్షన్ లను అందిస్తోంది. 4GB RAM మరియు 64GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999, అయితే 6GB RAM + 128GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన వేరియంట్ ధర రూ.12,999.
Poco M6 Pro 5G: స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు
Poco M6 Pro 5Gని ప్రవేశ పెట్టింది. ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. స్మార్ట్ఫోన్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ఫోన్ కు భద్రత కలుగుతుంది. హుడ్ కింద, ఇది Qualcomm Snapdragon 4 Gen 2 SoC ద్వారా శక్తిని పొందుతుంది. అవుట్-ఆఫ్-ది-బాక్స్, ఇది Android 13-ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది.అలాగే 2 ప్రధాన OS అప్‌డేట్‌లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ నవీకరణల కోసం కమిట్ మెంట్ కలిగి ఉంటుంది.
ఈ Poco M6 Pro 5G వెనుకవైపు డ్యూయల్ కెమెరా యూనిట్ తో ఉంటుంది. ఫోన్ 50-మెగాపిక్సెల్ AI సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి వస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీ(selfie)లు మరియు వీడియో కాల్(video call)ల కోసం 8- మెగా పిక్సెల్ కెమెరా ను డిస్ ప్లే పైన – మధ్య భాగంలో హోల్ పంచ్ కటౌట్‌లో ఉంచబడింది.
POCO మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉంది. USB టైప్-C కేబుల్, అలాగే ఈ డివైజ్ IP53 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. అదనంగా, హ్యాండ్ సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.