Recover permanently deleted files from PC : ముఖ్యమైన ఫైల్స్ పర్మనెంట్ గా డిలీట్ అయ్యాయా? రికవర్ చేసుకోండి ఇలా!

Windows PCలో పర్మనెంట్ గా డిలీట్ అయిన ఫైల్‌లను ఎలా రీస్టోర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Recover permanently deleted files from PC : ముఖ్యమైన ఫైల్‌లు మీ కంప్యూటర్ నుండి పర్మనెంట్ గా డిలీట్ అయ్యాయా? వాటిని ఎలా రికవరీ చేయాలో తెలియదా? అయితే, డోంట్ వర్రీ.. డిలీట్ అయిన ఫైల్‌లను విండోస్ పీసీలో సులభంగా తిరిగి పొందవచ్చు. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Windows PCలో పర్మనెంట్ గా డిలీట్ అయిన ఫైల్‌లను రీస్టోర్ చేయడానికి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ చాలానే ఉంటాయి. వాటిల్లో డిస్క్ డ్రిల్ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ వీటిలో ఒకటి. ఇది పర్మనెంట్ గా డిలీట్ అయిన డేటాను కూడా సులభంగా రికవరీ చేయవచ్చు.

  • ముందుగా, డ్రిల్ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • మీ కంప్యూటర్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ప్రారంభించండి.
  • ఆపై SSDలు, హార్డ్ డిస్క్‌లు మరియు మెమరీ కార్డ్‌ల వంటి ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజ్ లను మీ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.
  • ఇప్పుడు, డ్రిల్ డేటా రికవరీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించండి.
  • మీకు అవసరమైన స్టోరేజ్ డ్రైవ్‌ను ఎంచుకోండి.

Recover permanently deleted files from PC

  • స్టోరేజ్ డ్రైవ్‌పై క్లిక్ చేసి, ఆపై లాస్ట్ డేటా కోసం సర్చ్ చేయండి.
  • సాఫ్ట్‌వేర్ అప్పుడు పర్మనెంట్ గా డిలీట్ అయిన ఫైల్‌లను స్కాన్ చేసి, ఫైల్స్ ని వెతుకుతుంది.
  • స్కానింగ్ పూర్తయిన తర్వాత, అన్ని ఫైల్‌లను తిరిగి పొందడానికి దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.
  • రివ్యూ ఫౌండ్ ఐటమ్స్ పై క్లిక్ చేస్తే, కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ఈ విండోలో చాలా ఫైల్‌లు కనిపిస్తాయి.
  • అన్ని ఫైల్‌లు, ఫొటోస్, వీడియో, ఆడియో,డాకుమెంట్స్, ఆర్కైవ్‌లు మరియు ఇతర వాటి కోసం ఫిల్టర్‌లు కూడా ఉన్నాయి.
  • మీ అవసరాలకు తగినవి ఎంచుకోండి.
  • అప్పుడు దొరికిన ఫైల్స్ ఫోల్డర్‌ను ఓపెన్ చేయండి. అవసరమైన ఫైల్‌లను గుర్తించవచ్చు.
  • మీకు అవసరమైన ఫైల్ కనిపించకపోతే, Reconnected ఫోల్డర్‌ను చెక్ చేయండి.
  • ఇక, డిలీట్ అయిన ఫైల్‌లను వాటిలో చూడవచ్చు.
  • ఈ ఫైల్ క్వాలిటీతో ఉందో లేదో అని చెక్ చేయడానికి, ప్రక్కన ఉన్న eye ఐకాన్ ని క్లిక్ చేయండి.
  • అప్పుడు మీరు ఫైల్ యొక్క ప్రివ్యూని చూస్తారు.
  • ఫైల్ బాగానే ఉంటే, దాన్ని ఎంచుకుని, రికవర్ బటన్‌ను క్లిక్ చేయండి.
  • డిలీటెడ్ ఫైల్‌లను త్వరగా తిరిగి పొందవచ్చు.
  • ఫైల్స్ రికవర్ అయ్యాక.. మీరు నోటిఫికేషన్‌ను అందుకుంటారు.
  • మీరు Show Recovered data పై క్లిక్ చేస్తే, మీరు డిలీట్ అయిన ఫైల్‌ కనిపిస్తుంది.
Recover permanently  deleted files from PC

Comments are closed.