లీకైన Redmi12 5G..గ్లోబల్ లాంఛ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న Redmi గాడ్జెట్స్

Telugu Mirror: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ Xiaomi యొక్క సబ్-బ్రాండ్, Redmi, ఆగష్టు 1న ఒక ఉల్లాసకరమైన గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. లాంఛ్ ఈవెంట్ లో Redmi తన కొత్త స్నేహపూర్వక – బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Redmi12 5Gని ఆవిష్కరించనుంది.అలాగే Redmi వాచ్ 3 యాక్టిివ్ తోపాటుగా పర్యావరణ హిత మైన ఇతర ఉత్పత్తులు Xiaomi TV X సిరీస్ ను విడుదల చేయనుంది.

విడుదల కంటే ముందుగానే Redmi 12 5G యొక్క ధర మరియు స్టోరేజ్ ఎంపికల గురించి టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన లీక్ ల ద్వారా సమాచారం బయటపడింది. Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుందని భావిస్తున్నారు. ఒకటి 6GB RAM మరియు 128GB స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే మరొకటి 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 6GB RAM డివైజ్ ధర రూ.9,999గా ఉండవచ్చని, 8GB RAM మోడల్ ధర రూ.13,999 ఉండవచ్చని లీక్ లు సూచిస్తున్నాయి.

Also Read:Samsung Galaxy Z Fold 5, Z Flip 5: హ్యాండ్ సెట్ అందుబాటులోకి .. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకె

Redmi 12 5G స్మార్ట్ ఫోన్ స్నాప్‌ – డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది, Redmi 12 5G దాని ధరకు తగిన విధంగా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. వెనుకవైపు, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి వస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండి ఫిల్మ్ ఫిల్టర్ లు అలాగే LED సెన్సార్ కలిగిన ఫీచర్ లతో ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ రెయిన్‌బో కలర్స్ తో క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌ను డిస్ ప్లే చేస్తుంది. ఈ పరికరం 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Redmi note 12 5G specifications leaked
Image Credit:Telecom Talk

Redmi 12 5G పరికరం 90Hz అధిక రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండి 1080 × 2400 పిక్సెల్ ల రెజల్యూషన్ తో 6.79 – అంగుళాల ఫుల్ HD+ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఇది కెమెరా ఫ్రంట్ ఫేసింగ్ కు అనుగుణంగా ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్‌తో కూడా వస్తుంది.

Also Read: Reliance Jio:మీకు నచ్చే VIP మొబైల్ నంబర్ కావాలా?..

డివైజ్ ఆండ్రాయిడ్13-ఆధారిత MIUI 14 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

గ్లోబల్ లాంఛ్ ఈవెంట్ లో స్మార్ట్ ఫోన్ తో పాటుగా Redmi కంపెనీ తన కొత్త వాచ్ ప్రొడక్ట్ అయిన Redmi వాచ్ 3 యాక్టివ్ ను కూడా రిలీజ్ చేస్తుంది. ఇది దాని గ్లోబల్ వాచ్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉండి భారత దేశంలో ఈ స్మార్ట్ వాచ్ రూ.5,000 లోపు లభించవచ్చు అని భావిస్తున్నారు.

ఇదే ఈవెంట్ లో వినోదాన్ని వీక్షించేందుకు వీలుగా నూతన అప్ డేట్ లతో Xiaomi TV సిరీస్ లను కూడా ఆవిష్కరించనుంది Redmi.

Leave A Reply

Your email address will not be published.