Samsung Galaxy Z Fold 5, Z Flip 5: హ్యాండ్ సెట్ అందుబాటులోకి .. ధర, ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకె

Telugu Mirror: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Samsung నిర్వహించిన Samsung Galaxy Unpacked ఈవెంట్ లో Samsung Galaxy Z Fold 5 మరియు Samsung Galaxy Z Flip 5 హ్యాండ్ సెట్ లను రివీల్ చేసింది. Samsung Galaxy Z Fold 5 క్రీమ్, ఐసీ బ్లూ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లలో విడుదల కానుంది. అలానే గ్రే మరియు బ్లూ కలర్ ఆప్షన్ లు మాత్రం Samsung స్టోర్ లో మాత్రమే కొనడానికి అందుబాటులో ఉంటాయి. Galaxy Z Fold 5 7.6-inch QXGA+ (2,176 x 1,812 pixels) Dynamic AMOLED 2X Infinity Flex డిస్ ప్లే ను కలిగి ఉంది. అలానే 6.2-inch full-HD+ (2,316 x 904 pixels) Dynamic AMOLED 2X కవర్ డిస్ ప్లే తో అందుబాటులోకి రానుంది. అలానే 1750nits బ్రైట్ నెస్ ను సపోర్ట్ చేస్తుంది, ఎండలో కూడా స్పష్టంగా చూడవచ్చని Samsung తెలిపింది.

Also Read:iQOO Z7 Pro : అదిరిపోయే ఫీచర్స్, వారేవా స్పెసిఫికేషన్స్ తో ఆహా అనిపించనున్న iQOO Z7 Pro..

Samsung Galaxy Z Fold 5 మూడు వేరియంట్ లలో విడుదల కానుంది. 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ మరియు 12GB + 1TB ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో మార్కెట్ లోకి రానున్నది. అన్ని మోడళ్లు Snapdragon 8 Gen 2 ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ తో వస్తాయి. ఈ హ్యాండ్ సెట్ ఒక పీసి లాంటి పవర్ నీ కలిగి ఉందని, ఈ ఫోన్ గేమ్ కన్సోల్ లాంటిదని కంపెనీ పేర్కొంది. అలానే మల్టీ టాస్కింగ్ కు బాగా పనికొస్తుంది చెప్పింది. Samsung Galaxy Z Fold 4 తో పోలిస్తే Galaxy Z Fold 5 యొక్క GPU పెర్ఫార్మెన్స్ 32 శాతం మరియు CPU పెర్ఫార్మెన్స్ 18 శాతం పెరిగిందని Samsung తెలిపింది. మల్టీ టాస్కింగ్ ను సులభం చెయ్యడానికి కంపెనీ, స్క్రీన్ పై ఒకే సారి మూడు విండోలను ఓపెన్ చేసెట్టుగా ఫోన్ ను తయారు చేసింది.

Image credit:Fortress of solitude

Samsung Galaxy Z Fold 5 ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. 50- మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు 10- మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. అలానే 10- మెగా పిక్సెల్ కవర్ కెమెరా మరియు 4- మెగా పిక్సెల్ సెల్ఫి కెమెరాను కలిగి ఉంటుంది.

Also Read:Motorola G14 : బడ్జెట్ ధరలో అద్భుత ఫీచర్స్..అబ్బురపరచనున్న మోటోరోలా G14..

ఈ హ్యాండ్ సెట్ 4400mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. Samsung Galaxy Z Fold 5 యొక్క ధర రూ.1.50,000 వరకు ఉండవచ్చు, ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఆగస్ట్ 11 నుంచి ప్రారంభం అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.