samsung tv discount: 35 శాతం డిస్కౌంట్ తో శాంసంగ్ స్మార్ట్ టీవీ, మరి ఇంత తక్కువ ధరకేనా!

samsung tv discount

samsung tv discount: తక్కువ ధరలో మంచి స్మార్ట్ టీవీని కొనాలని అనుకుంటున్నారా? ఇకామర్స్ వెబ్సైట్లలో స్మార్ట్ టీవీలపై, మరెన్నో ఇతర పరికరాలపై ఎన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి. అయితే, అమెజాన్ ఇప్పుడు 35 శాతం డిస్కౌంట్ తో ఒక మంచి స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. మరి ఇంతకీ ఆ స్మార్ట్ టీవీ ఏ కంపెనీ? దాని ధర ఎంత? ఫీచర్లు , స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వండర్‌టైన్‌మెంట్ సిరీస్ HD రెడీ LED స్మార్ట్ టీవీ

శాంసంగ్ ఇండియా (Samsung India) ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన 32 అంగుళాల వండర్‌టైన్‌మెంట్ సిరీస్ HD (samsung wondertainment series HD) రెడీ LED స్మార్ట్ టీవీ ఇప్పుడు అమెజాన్ లో 35 శాతం డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ గురించి ఒకసారి చూద్దాం.

ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు 

HD రెడీ (1366×768) రిజల్యూషన్ ని, 60 Hz రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. ఈ టీవీకి కనెక్ట్ చేయడానికి 2 HDMI పోర్ట్‌లు, 1 USB పోర్ట్ ఉంది. సెట్-టాప్ బాక్స్‌లు, బ్లూ-రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్‌లతో కనెక్ట్ చేసుకోవచ్చు. అదే 1 USB పోర్ట్ తో హార్డ్ డ్రైవ్‌లు, మౌస్, కీబోర్డ్ మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు.
20-వాట్ అవుట్‌పుట్ , డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ (Dolby Digital Plus Sound) ని కలిగి ఉంది. RAM ఇన్స్టాలేషన్ సైజు 1.5జీబీ ఉంది.

ఇక LED డిస్ప్లే ని కలిగి ఉన్న ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే.. పర్సనల్ కంప్యూటర్ , స్క్రీన్ షేర్ , మ్యూజిక్ ప్లేయర్ , కంటెంట్ గైడ్ , కనెక్ట్ షేర్ మూవీ డిస్‌ప్లే LED ప్యానెల్ తో ఉంది. ఇంకా ఈ స్మార్ట్ టీవీ మెగా కాంట్రాస్ట్ పర్ కలర్, HD పిక్చర్ క్వాలిటీ (HD Pic)ని కలిగి ఉంది.ఇది స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్‌తో ఉన్నాయి.

ఇక టీవీ యొక్క వారంటీ విషయానికి వస్తే, ఇన్‌వాయిస్ తేదీ నుండి బ్రాండ్ వారీగా 1 సంవత్సరం వారంటీ ఉంది. అదనంగా ప్యానెల్‌ పై మరో సంవత్సరం వారంటీ ఉంది.

ఇన్‌స్టాలేషన్ సమయంలో, కస్టమర్‌లు వారి ఎంపిక ఆధారంగా ఒక LED TV, ఒక కస్టమర్ మాన్యువల్, ఒక వారంటీ కార్డ్, ఒక రిమోట్ కంట్రోల్,2 AAA బ్యాటరీలు మరియు వాల్ మౌంట్ లేదా టేబుల్ టాప్‌ని అందుకుంటారు. ఈ ప్రొడక్ట్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే 8.3 x 73.2 x 43.9 cm తో 3.8 కేజీల బరువు ఉంది.

అమెజాన్ లో వండర్‌టైన్‌మెంట్ సిరీస్ HD రెడీ LED స్మార్ట్ టీవీ యొక్క ధర రూ. 22,900 వద్ద ఉండగా, 35 శాతం డిస్కౌంట్ ఉండడంతో రూ.14,900 మాత్రమే ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఇక ఈఎంఐ రూపంలో అయితే రూ. 727 కి పొందవచ్చు.

 

వండర్‌టైన్‌మెంట్ సిరీస్ (wondertainment series) HD రెడీ LED స్మార్ట్ టీవీ

బ్రాండ్  శాంసంగ్
స్క్రీన్ సైజు 32 అంగుళాలు
ఇంటర్నెట్ సేవలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీలివ్, యూట్యూబ్ మరియు హాట్‌స్టార్
డిస్ప్లే టెక్నాలజీ ఎల్ఈడీ
రిజల్యూషన్ 720p
రిఫ్రెష్ రేట్ 60Hz
మోడల్ పేరు UA32T4340BKXXL
యాస్పెక్ట్  నిష్పత్తి 16:9
కంపోనెంట్స్ ‎1 LED TV, 1 వినియోగదారు మాన్యువల్, 1 వారంటీ కార్డ్, 1 రిమోట్ కంట్రోల్, 2 AAA బ్యాటరీలు, వాల్ మౌంట్ / టేబుల్ టాప్
కనెక్టివిటీ టెక్నాలజీ Wi-Fi, USB, ఈథర్నెట్ మరియు HDMI

samsung tv discount

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in