Telugu Mirror : నేటి సమాజంలో స్కూల్ కి వెళ్ళే పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ మొబైలు ఫోన్లు వినియోగిస్తునారు. అయితే ఎవరి ఆర్ధిక స్థోమతకు అనుగుణంగా మొబైలు ఫోన్లు కొంటుంటారు, పేద, మద్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే భారత్ దేశంలో తక్కువ ధరకే మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయటానికి ఇష్టపడతారు మరియు మొబైల్ తయారీ కంపెనీలు కూడ ఇందుకు అనుగుణంగానే తక్కువ బడ్జెట్ మొబైల్స్ (Low Budget Mobiles) తయారు చేయటానికి మక్కువ చూపిస్తునాయి, అయితే కొన్ని మొబైలు కంపెనీలు ఏకంగా 7000 రూపాయలకే సెల్ ఫోన్లని మార్కెట్ లోకి ప్రేవేశపెట్టాయి.
అయితే ఇంత తక్కువ బడ్జెట్ మొబైలు లో హై క్వాలిటి కెమెరా, క్వాలిటి డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ (Fast Charging) వంటి ఫీచర్స్ ఉండవు, ఒకవేళ మీరు కాల్స్ చేయడం, టెక్ట్స్ మెసేజ్ (Text Message) పంపడం లేదా వెబ్ బ్రౌజ్ చేయడం వంటి ప్రాథమిక పనుల కోసం అయితే ఈ బడ్జెట్ మొబైలుని నిస్సందేహంగా కొనుగోలు చేయవచ్చు. మేము మీ కోసం కొన్ని బడ్జెట్ సెల్ ఫోన్లని మరియు వాటి పూర్తి వివరణను ఇక్కడ తెలియజేస్తున్నాం.
టెక్నో స్పార్క్ 9 (Techno Spark9)
టెక్నో స్పార్క్ 9 ప్రస్తుతం రూ .6,999 కు అందుబాటులో ఉంది, మీడియాటెక్ హీలియో మొబైల్లో 6.6 అంగుళాల హెచ్ డీ+ డాట్ నాచ్ డిస్ ప్లేను అందించారు. ఇందులో జీ37 ప్రాసెసర్, 64 జీబీ ఈఎంసీపీ స్టోరేజ్ తో, 4 జీబీ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
రియల్మీ నార్జో 50ఐ ప్రైమ్ (Real Me Narzo 50 i Prime)
చైనీస్ మొబైల్ మేకర్ అయిన రియల్మీ నార్జో 50ఐ ప్రైమ బడ్జెట్ మొబైలు కేవలం రూ.6,999 కు యూనిసోక్ టీ612 ప్రాసెసర్ (Unisoc T612 Processor) తో వినియోగదారులకి అందుబాటలోకి ఉంది, మిగితా ఫీచర్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను మరియు 4 జీబీ LPDDR4X ర్యామ్ ని అందించారు. 64 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
టెక్నో పాప్ 7 ప్రో (Tecno POP 7 Pro)
10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇందులో 6.56 అంగుళాల హెచ్ డీ+ డాట్ నాచ్ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ ఎంటీ 6761 హీలియో ఏ22 ప్రాసెసర్ (MediaTek Helio A22 Processor), 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఎక్స్ టర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. టెక్నో పాప్ 7 ప్రో ప్రస్తుతం రూ .6,099 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఐటెల్ ఎ60ఎస్ (Itel A60S)
యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఐటెల్ ఏ60ఎస్ ప్రస్తుతం రూ.5,999 ధరకు అందుబాటులో ఉంది.
రెడ్ మీ ఏ2 (Redmi A2)
రెడ్ మీ కంపెనీ రెడ్ మీ ఏ2 పేరుతో మే నెలలో లాంచ్ చేసింది, మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ (MediaTek Helio G36), 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ తో 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 16.5 సెంటీమీటర్ల హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ (10 Watt Fast Charging) సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. రెడ్ మీ ఏ2 ప్రస్తుతం రూ.6,799 ధరకు లభిస్తోంది.