Telugu Mirror: OnePlus కొత్త ఫోన్ ను ఈ ఏడాది చివరిలో విడుదల చేయబోతోంది. OnePlus 12 5G అనే పేరుతో OnePlus ఫోన్ ను తీసుకు రాబోతుంది. ఈ సారి OnePlus, OnePlus 12 5G లో కొత్త మార్పులను తీసుకురాబోతుంది. OnePlus 11 తో పోలిస్తే వచ్చే OnePlus 12 మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా OnePlus 12 5G గురించి కొన్ని లీక్ లు తెలిసాయి.
OnePlus 12 5G ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుంది. OnePlus 12 ” centered single hole ” డిస్ ప్లే తో రాబోతుంది, అంటే డిస్ ప్లే పైన మధ్యలో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలానే 2K రెజల్యూషన్ కలిగిన అల్ట్రా-నారో కర్వ్డ్ డిస్ ప్లే తో రాబోతుంది. OnePlus ఎప్పుడు కెమెరా విషయంలో గానీ పెర్ఫార్మెన్స్ విషయంలో గానీ, తన యూజర్స్ లను నిరాశపరచదు. అలానే ఈ సారి కెమెరా పెద్ద అప్ డేట్ తో వస్తుందని సమాచారం. ఈ సారి OnePlus 12 50MP + 50MP + 64MP ట్రిపుల్ కెమెరా సీరీస్ తో రాబోతుంది. OnePlus12, 50- మెగా పిక్సెల్ IMX9 సీరీస్ ను కలిగిన ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అలానే 50- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు 64- మెగా పిక్సెల్ OV64B టెలిఫోటో లెన్స్ తో రాబోతుంది. సాదరణంగా ఏ ఫోన్ లోనైనా మెయిన్ కెమెరా మంచి మెగా పిక్సెల్స్ తో, మిగతా కెమెరాలు మామూలుగా ఉంటాయి కానీ OnePlus మూడు హై క్వాలిటీ కెమెరాలను కలిగి ఉంది.ఈ లెన్స్ లతో మనం మంచి ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే , OnePlus11 లో లాగా 5000mAh+ బ్యాటరీ తో వస్తుంది. OnePlus 12 కూడా ఫోన్ ను రోజు మొత్తం ఉపయోగించడానికి వీలుగా 5000mAh+ బ్యాటరీ తోనే రావచ్చు. అలానే ఇప్పటి వరకు ఏ ఫోన్ తీసుకురాని కొత్త 150W అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
OnePlus 12 కొత్త చిప్ సెట్ అయిన Qualcomm Snapdragon 8 Gen 3 SoC తో రాబోతుంది. ఈ చిప్ సెట్ ను ఇంతవరకు ఏ ఫోన్ లో వాడలేదు. కాబట్టి OnePlus 12 పెర్ఫార్మెన్స్ విషయంలో అస్సలు తగ్గదు. OnePlus 11 లో లాగానే OnePlus 12 కూడా మూడు కెమెరాలు ఒక సర్కిల్ లోపల కలిగి ఉండవచ్చు. ఈ విషయాల పై OnePlus అధికారికంగా స్పందించలేదు, అలానే ఈ ఫోన్ గురించి ఏ విషయాన్ని కూడా ప్రకటించలేదు. OnePlus 12 ఈ సంవత్సరం ఆఖరులో కానీ లేదా వచ్చే సంవత్సరం మొదట్లో కానీ విడుదల అవుతుంది.