Valuable Digital Voter ID : 2024 లో డిజిటల్ ఓటర్ ఐడిని మొబైల్ లో పొందడం ఎలా? తెలుసుకోండి ఇలా..!

మన ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ రూపంలో మన మొబైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆధార్ కార్డ్ లాగా లామినేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Valuable Digital Voter ID : మనలో చాలా మందికి ఓటరు గుర్తింపు కార్డు మరియు ఆధార్ కార్డు రెండూ ఉంటాయి. అయితే, ఇవి కొందరికి ఓటర్ కార్డు ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఓటర్ కార్డుని ఎలా పొందాలో తెలుసా? మన ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ రూపంలో మన మొబైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆధార్ కార్డ్ లాగా లామినేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ లోనే డిజిటల్ ఓటర్ కార్డు

  • ముందుగా, కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ (https://voters.eci.gov.in/login)ని సందర్శించండి.
  • అక్కడ, మీరు మీ మొబైల్ నంబర్ ను నమోదు చేసుకోవాలి.
  •  మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, మీ ఫోన్‌కు OTP వస్తుంది.
  • మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయమని అడుగుతుంది.
  • క్రియేట్ చేస్తే ఇక రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు.
  • మీ మొబైల్ నంబర్ మరియు పాస్‌వర్డ్, అలాగే క్యాప్చా నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, అభ్యర్థన OTP బటన్‌ను క్లిక్ చేయండి. తర్వాత OTPని నమోదు చేసి, వెరిఫై అండ్ లాగిన్ పై  క్లిక్ చేయండి.

Valuable Digital Voter ID

  • ఇక రైట్ కార్నర్ లో E-EPIC డౌన్‌లోడ్ బటన్‌ను క్లిక్ చేయండి. మీరు EPIC_NO నమోదు చేసే దగ్గర మీ ఓటర్ ID కార్డ్ నుండి EPIC నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. తర్వాత సెలెక్ట్ స్టేట్‌లో మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత, సెర్చ్ బాక్స్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఓటర్ ID వివరాలను చూపిస్తుంది. అందించిన సమాచారం సరైనదని మీకు అనిపిస్తే, “Send OTP” బటన్‌ను క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో అందుకున్న OTPని నమోదు చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయండి.
  • మీరు నమోదు చేసిన OTP సరైనదైతే, అది కరెక్ట్ గా చూపిస్తుంది. ఆ తర్వాత, మీ డిజిటల్ ఓటరు IDని పొందడానికి “డౌన్‌లోడ్ e-EPIC” బటన్‌పై క్లిక్ చేయండి.

డిజిటల్ ఓటరు ఐడి కార్డు మీ మొబైల్ ఫోన్లో పిడిఎఫ్ ఫార్మాట్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని ప్రింట్ చేయవచ్చు, స్కాన్ చేయవచ్చు మరియు లామినేట్ చేయవచ్చు. ఇక, మీ మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు వినియోగించవచ్చు.

Valuable Digital Voter ID

Comments are closed.