WhatsApp calls Record : వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలానో తెలుసా? ఈ సింపుల్ ట్రిక్ అప్లై చేయండి!

సాధారణ ఫోన్ కాల్స్ లాగానే వాట్సాప్ కాల్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ని వినియోగించకుండా వాట్సాప్ కాల్స్ ని ఎలా రికార్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp calls Record : వాట్సాప్ వినియోగం మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ ఉండాల్సిందే అన్నట్టు మారిపోయింది. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ మరియు చాటింగ్ కోసం ఎక్కువగా వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. నార్మల్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఫోన్ లో కాల్ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. మరి, వాట్సాప్ కాల్ (WhatsApp call) మాట్లాడేటప్పుడు కాల్ ఎలా రికార్డ్ చేయాలో మీకు తెలుసా?

సాధారణ ఫోన్ కాల్స్ లాగానే వాట్సాప్ కాల్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. మీరు ఒక్క ట్యాప్‌ చేస్తే చాలు కాల్ చేయవచ్చు. అయితే, మన ఫోన్‌లలో వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు. కానీ, వాట్సాప్ కాల్స్ ని రికార్డ్ చేయడం కోసం థర్డ్ పార్టీ యాప్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు.

అయితే, ఇప్పుడు మనం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ని వినియోగించకుండా వాట్సాప్ కాల్స్ ని ఎలా రికార్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్ కాల్‌ని రికార్డ్ చేయడం ఎలా?

వాట్సాప్ కాల్ ఇప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు. వాట్సాప్ కాల్‌లు, ఇన్‌కమింగ్ మరియు అవుట్‌గోయింగ్ రెండింటినీ రికార్డ్ చేయవచ్చు. మీరు WhatsApp కాల్‌ని స్వీకరించినప్పుడు లేదా ఎవరికైనా కాల్ చేసినప్పుడు, కాల్ సమయంలో లేదా ముందు ఈ టిప్స్ ని పాటించండి.

WhatsApp calls Record

మీ ఫోన్‌లో స్క్రీన్‌ను రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండి. రికార్డ్ చేసేటప్పుడు మీడియా, మైక్ ఆప్షన్ ను ఎంచుకోండి. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత, స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఆ తర్వాత, మీ కాల్ రికార్డ్ అవుతుంది. ఆడియోతో పాటు వీడియో కూడా కనిపిస్తుంది.

మీరు వీడియో కాల్‌లను కూడా రికార్డ్ చేయవచ్చు.

మీరు పైన పేర్కొన్న పద్ధతులను ఉపయోగించి కేవలం ఫోన్ కాల్‌లను మాత్రమే కాకుండా వీడియో కాల్‌లను కూడా రికార్డ్ చేయవచ్చు. వీడియో కాల్‌ని రికార్డ్ చేయడానికి కూడా, అదే ప్రాసెస్ ను అనుసరించాలి.ఇలా రికార్డింగ్ ఆప్షన్ ను దుర్వినియోగం చేయకూడదని గుర్తుంచుకోండి. తప్పనిసరి అయితే తప్ప ఎవరి వాయిస్ లేదా వీడియో కాల్‌లను రికార్డ్ చేయడం అంత మంచిది కాదు. అనవసరమైన రికార్డింగ్‌లు చేసి లేనిపోని సమస్యలను తెచ్చుకోకండి.

WhatsApp calls Record

Comments are closed.