Tecno Camon 20 Premier 5G | టెక్నో నుంచి మరో బడ్జెట్ ఫోన్..ఇవీ ఫీచర్లు..!

Telugu Mirror : భారత దేశంలో కొత్తగా Tecno Camon 20 Premier 5G ఫోన్ విడుదల అయ్యింది. జూలై 7 నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇప్పటికే Tecno Camon 5G మరియు Tecno Camon Pro 5G మన దేశంలో మే లో రిలీజ్ అయ్యాయి. Tecno, Camon యొక్క హై ఎండ్ మోడల్ ను త్వరలోనే విడుదల చేస్తామని కంపెనీ మే లోనే తెలిపింది.

Tecno Camon 20 Premier 5G 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన 6.67-inch Full HD+ AMOLED డిస్ ప్లే తో అందుబాటులో ఉంది. డార్క్ వెల్కిన్ మరియు సెరెనిటీ బ్లూ ఇలా రెండు కలర్ ఆప్షన్ లలో ఈ హ్యాండ్ సెట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క డిజైన్ ఎంతో యునిక్ గా ఉంటుంది, ప్రీమియం లెదర్ ఫినిష్ డిజైన్ తో ఈ ఫోన్ ను చేశారు దాంతో ఈ డిజైన్ ఫోన్ కు ఆకర్షణగా మారింది.

Panchangam 08 July — ఆషాఢం షష్ఠి తిథి వేళ రాహుకాలం, అమృతకాలం ఎప్పుడొచ్చాయంటే…

కెమెరా విశయానికి వస్తే , Tecno Camon 20 Premier 5G 108- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ మాక్రో లెన్స్ తో వస్తుంది. ఈ కెమెరాతో అల్ట్రా వైడ్ మరియు మాక్రో షాట్ లను తియ్యవచ్చు. అలానే ఒక 50- మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాతో మనం మంచి క్లారిటీ ఉన్న ఫోటోలను తీయవచ్చు అలానే చిన్న వస్తువులను కూడా స్పష్టంగా ఫోటో తియ్యవచ్చు. 32- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. RGBW సెన్సార్ షిఫ్ట్ అనే కెమెరా ఫీచర్ ను ఇతర Tecno ఫోన్ లలో వాడినట్టు ఈ ఫోన్ లో కూడా తీసుకొచ్చారు.

Tecno Camon 20 Premier 5G ఒక్క మోడల్ లోనే అందుబాటులో ఉంది. 8GB RAM మరియు 512GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క బేస్ ధర రూ.29,999. ఈ హ్యాండ్ సెట్ MediaTek Dimensity 8050 SoC చిప్ సెట్ తో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ చిప్ సెట్ ను ఏ ఫోన్ లో వాడలేదు. అలానే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 14 ( బీటా ) మరియు HiOS తో నడుస్తుంది. ఈ ఫోన్ ను 16GB RAM వరకు ఎక్స్ పాండ్ చెయ్యవచ్చు.

Samsung Galaxy M34 5G: వచ్చేసింది…6,000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా

ఈ హ్యాండ్ సెట్ 5000mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. అలానే ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 5G, 4G, OTG, NFC, GPS, WiFi మరియు Bluetooth కనెక్టివిటీలను కలిగి ఉంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in