Telangana EAPCET 2024: తెలంగాణ ఈఏపీసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు, ఎప్పటినుండంటే?

తెలంగాణ ఈఏపీసెట్ 2024 కౌన్సిలింగ్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telangana EAPCET 2024: తెలంగాణ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజినీరింగ్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి BE/BTech/ఫార్మసీ డిగ్రీలలో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 4న ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఉన్నత విద్యామండలి సవరించిన టైమ్‌టేబుల్‌ (Time Table) ను కూడా విడుదల చేసింది. సవరించిన టైమ్‌టేబుల్ ప్రకారం, కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 4 నుండి ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ మూడు దశల్లో సాగుతుంది. మొదటి భాగం జూలై 4 నుండి జూలై 23 వరకు, రెండవది జూలై 26 నుండి ఆగస్టు 2 వరకు, చివరి దశ ఆగస్టు 8 నుండి ఆగస్టు 15 వరకు ఉంటుంది. తెలంగాణ ఈప్సెట్ పరీక్షను మే 7 నుండి 11 వరకు ఆన్‌లైన్‌ (Onlline) లో నిర్వహించి, ఫలితాలను వెల్లడించారు. మే 18న 74.98 శాతం మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించగా, వ్యవసాయ, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

మొదటి దశ కౌన్సిలింగ్ (First Phase Counselling):

జూలై 4 నుండి జూలై 12 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (online registration) మరియు స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది.
జూలై 6 నుంచి జూలై 13 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
జూలై 8–జూలై 15 వరకు ఆప్షన్స్ ఎంపిక
జూలై 15న ఎంపికల ఫ్రీజింగ్
జూలై 19న సీట్ల కేటాయింపు
జూలై 19 నుండి జూలై 26 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్

రెండో దశ కౌన్సెలింగ్‌ (Second Phase Counselling) .

జూలై 26న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్.
జూలై 27న సర్టిఫికెట్ల పరిశీలన
జూలై 27 నుండి 28 వరకు ఆప్షన్స్ ఎంపిక
జూలై 28న ఎంపికల ఫ్రీజింగ్
జూలై 31న సీట్లు కేటాయింపు.
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్

TS EAPCET 2024

Also  Read: AP TET Notification: నేడే ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ.

మూడో దశ కౌన్సెలింగ్‌ (Third Phase Counselling).

ఆగస్టు 8న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్.
ఆగస్టు 9న సర్టిఫికెట్ల పరిశీలన
ఆగస్టు 9 నుండి ఆగస్టు 10 వరకు ఆప్షన్స్ ఎంపిక.
ఆగస్టు 10న ఎంపికల ఫ్రీజింగ్
ఆగస్టు 13న సీట్ల కేటాయింపు
ఆగస్టు 13 నుండి 15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్

కౌన్సిలింగ్ కి తీసుకురావాల్సిన పత్రాలు ఇవే :

10వ తరగతి మార్కుల మెమో
ఇంటర్మీడియట్ మార్కుల మెమో
బదిలీ సర్టిఫికేట్ (TC)
స్టడీ సర్టిఫికేట్
తాజా ఆదాయ ధృవీకరణ పత్రం (Income certificate)
కుల ధృవీకరణ సర్టిఫికేట్ (caste certificate)
తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్ టికెట్
తెలంగాణ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డ్
ఆధార్ కార్డ్
పాస్ ఫోటో

Comments are closed.