Telugu Mirror : ఎండలు మండుతున్నాయి. శివరాత్రి పండుగ పూర్తి అయిన దగ్గర నుండి ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. మరి కొన్ని రోజులు అయితే ఎండ తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఈ ఎండల వల్ల జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి రోజు రోజుకు పెరుగుతుండడంతో పిల్లలు, పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ వేడి వల్ల పిల్లలు స్కూల్స్ లో కూడా కూర్చోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటి పూట బడులు (Half Day Schools) నిర్వహించాలని ఆలోచిస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ ఒంటి పూట బడులని ఎప్పుడు ప్రారంభిస్తుంది? సెలవులు ఎప్పటి నుండి ప్రకటించనుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : Jio Recharge : అంబానీ కుమారుడి పెళ్లి..జియో ఫ్రీ రీఛార్జ్.. నిజమేనా?
తెలంగాణాలో ఒంటి పూట బడులు..
ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) స్కూల్ పిల్లలకు ఒంటి పూట బడులు ప్రారంభిస్తుంది. రేపటి నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎండ తీవ్రత (Sun intensity) పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి 12:30 వరకు స్కూల్స్ నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది. అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ స్కూల్స్ కి ఒంటి పూట బడులు రేపటి నుండి నడుస్తాయి.
పది పరీక్షల కారణంగా..
ఈ నెల 18 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదవ తరగతి పరీక్షలు ఉదయం జరుగుతాయి కాబట్టి పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు మిగతా తరగతులకు మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు క్లాసులు జరుగుతాయి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో భోజన సౌకర్యం..
రేపటి నుండి ఉదయం 8 గంటల నుండి 12:30 వరకు క్లాసులు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు క్లాసులు జరిగిన అనంతరం మధ్యాహ్న భోజన (Lunch) సౌకర్యం ఉంటుంది. పిల్లలు భోజనం చేశాక ఇంటికి వెళ్తారు. అన్నీ పాఠశాలల్లో కూడా ఫాన్స్ సౌకర్యం ఉండేలా చూడాలని ప్రభుత్వం చెప్పింది. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం పేర్కొన్నది.
ఎండ, వేడి గాలులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఫాన్స్ , త్రాగు నీరు వంటి సౌకర్యాలు అందేలా చూడాలని అన్నీ పాఠశాలలను ప్రభుత్వం ఆదేశించింది.
Also Read : RBI : ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఆ రెండు బ్యాంకులకు ఎదురుదెబ్బ.
పిల్లలు జాగ్రత్త..!
పిల్లలందరూ ఉదయం బడులకు వెళ్ళి మధ్యాహ్నం (Afternoon) ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఎండలను కూడా పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలని దగ్గర ఉండి తమని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వడ దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎండలో తిరగకుండా ఉండేలా కొన్ని జాగ్రత్తలు చెప్పి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి.