Telangana LAWCET Key: తెలంగాణ లా-సెట్ కీ విడుదల, రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోండి!
లా-సెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రిలిమినరీ ఆన్సర్ కీ మరియు రెస్పాన్స్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే..
Telangana LAWCET Key : తెలంగాణ లాసెట్ – 2024కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. అభ్యర్థులు ఇప్పుడు ప్రిలిమినరీ ఆన్సర్ (Priliminary Answer) కీ మరియు రెస్పాన్స్ షీట్ (Response Sheet)లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపాలని కోరారు. అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో TS LAWCET & TG PGLCET QUESTION PAPERS ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. వారు మూడేళ్ల లా కోర్సు, ఐదేళ్ల కోర్సు, ఎల్‌ఎల్‌ఎం కోర్సు ప్రశ్నపత్రాలను ఎంచుకోవచ్చు.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు LAWCET/PGLCET హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేసి రెస్పాన్స్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోడానికి.. ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) రాష్ట్రంలోని న్యాయ కళాశాల (Law College) ల్లో మూడు సంవత్సరాల మరియు ఐదు సంవత్సరాల న్యాయ కోర్సులలో ప్రవేశాల కోసం TS LAWCET/TS PGLCET-2024ను నిర్వహిస్తోంది. జనరల్ అభ్యర్థులు 45% మార్కులతో, OBC 42%, SC, STలు 40% మార్కులతో మరియు ఇంటర్మీడియట్ జనరల్ 45%, OBC 42%, SC, ST 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. లా కోర్సుల్లో ప్రవేశానికి వయోపరిమితి లేదు.
Also Read:TSPSC Recruitment : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, లక్షల్లో జీతాలు!
టీఎస్ లాసెట్ పరీక్షలు జూన్ 3న, మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10:30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, మూడోది సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లాసెట్‌కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. LAWCET మరియు PGLCETలో పొందిన ర్యాంకుల ద్వారా రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతాయి.
Comments are closed.