Telangana Mega DSC Notification 2024 Useful Information: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
Telangana Mega DSC Notification 2024: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 11,062 ఉద్యోగాలకు విడుదలైన నోటిఫికేషన్ లో 2629 స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మార్చి 4 నుంచి దరఖాస్తులు చేసుకునే గడువు ఇచ్చారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో అప్లై చేసిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గరిష్ట వయోపరిమితిని 46ఏళ్లుగా పేర్కొన్నారు.
గతేడాది సెప్టెంబరు 6వ తేదీన 5,089 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని పోస్టులను అదనంగా పెంచి తాజాగా గురువారం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు.
11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.
హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య. pic.twitter.com/4jcijEsmpq
— Telangana CMO (@TelanganaCMO) February 29, 2024
హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537, పెద్దపల్లి జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 21, ఖమ్మం జిల్లాలో 176 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు, ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు, హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158, ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99, ఎస్జీటీ ఉద్యోగాలు 161 ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు, 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.
కొత్త సర్కార్ లో కొలువులు వస్తాయని బావిస్తున్న నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ లు చెప్తున్నది. ఇటీవల సుమారు 23వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఇదే సమయంలో త్వరలో పోలీసులు రిక్రూట్ మెంట్ చేపడుతామని ప్రకటించారు. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని చెప్తున్నారు. తాజాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్లు వస్తుండటంతో నిరుద్యోగులు నగరాల బాట పట్టారు.
దీంతో పట్టాణాల్లో ఇప్పటిదాక దర్శనమిచ్చిన టూలెట్ బోర్డులు మాయమయ్యాయి. అద్దె ఇళ్లు దాదాపుగా నిరుద్యోగులతో నిండిపోతున్నాయి. ఇదే సమయంలో కోచింగ్ సెంటర్లలో కూడా నిరుద్యోగులు భారీగా జాయిన్ అయితున్నారు. కోచింగ్ సెంటర్లు, అద్దె ఇళ్లకు మంచి గిరాకీ వచ్చినట్టు అయింది. త్వరలోనే ఇతర నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో సీరియస్ ప్రిపరేషన్ పై నిరుద్యోగులు దృష్టి పెట్టారు.
Telangana Mega DSC Notification 2024
Comments are closed.