Telangana Rains : మే నెల ముగిసి, జూన్ నెల వచ్చేసింది. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణి కార్తె రాళ్లను పగిలేలా ఎండలు కొడతాయి అని పల్లె ప్రజల ఎక్కువగా నమ్ముతారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా పెరిగాయి. వడదెబ్బ తగిలి కొన్ని సంఖ్యలో చనిపోయారు.
జూన్ నెల వచ్చిందంటే వర్షాలు కురవడం మొదలవుతాయి. అయితే, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ నుండి చల్లటి కబురు అందింది . ఇన్ని రోజులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట రాలేని పరిస్థితి ఏర్పడింది. సూర్యుని ప్రభావంతో బయట అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడ్డారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు, మొన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా కురుస్తున్నాయి. అయితే, ఇప్పుడు నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి.
తెలంగాణలోని నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ జిల్లాల్లో నిన్న (జూన్ 3) మధ్యాహ్నం రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో నాలుగు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు కదులుతున్నందున రానున్న గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే, మంగళవారం అంటే ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఉపరితల ఆవర్తనం కారణంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.
కాగా, తెలంగాణలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. మొన్న మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు, వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణం కూల్ అయి వర్షం పడడంతో ప్రజలు ఉపశమనం పొందారు.