Telangana Runa Mafi Update: తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులకు ఆరు హామీలను ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో రైతు భరోసా, రూ. 2 లక్షల రుణమాఫీ (Runa Mafi) , రూ. 500 బియ్యం బోనస్ ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పలు హామీలలను నెరవేర్చారు. రైతుబంధు (Raithu Bandhu) జమ చేస్తున్నారు. అయితే రైతు భరోసా, రుణమాఫీ, వరి పంటకు రూ.500 బోనస్ ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆరు హామీలలో కొన్నింటిని అమలు చేయగా మరి కొన్ని అమలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ చేసిన ఆరు హామీల్లో రూ. 2 లక్షల రుణమాఫీ అత్యంత ముఖ్యమైనది. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే భట్టి విక్రమార్క (Bati Vikramarka) తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి హామీలు అమలు చేయకూడదు. అయితే తెలంగాణ (Telangana) లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక వచ్చే నెల 2వ తారీఖు వస్తే తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతుంది.
తెలంగాణ (Telangana) , ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ఉమ్మడి రాజధానిపై వచ్చే నెల 2 వ తారీఖు తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఈ నేపథ్యంలో విభజన అంశాలతో పాటు రైతు రుణమాఫీ (Runa Mafi) , ధాన్యం కొనుగోళ్లు విషయాలపై చర్చించనున్నారు.
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy), శ్రీధర్‌బాబు (Sridhar Babu) , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజలకు చేసిన నిబద్ధత మేరకు ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి దళారుల జోక్యం లేకుండా చేయాలని అనుకున్నారు. రైతు నుంచి పంటను సేకరించి మిల్లింగ్ చేసి రేషన్ షాపులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వానాకాలం ప్రారంభం కాకముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తడిసిన ధాన్యం, తేమ వంటివి వాటి వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లర్ల (Rice Miller) పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.