Telugu Mirror : ఈ సంవత్సరంలో దసరా (Dussehra) పండుగ కూడా వచ్చేస్తుంది. నవరాత్రుల పండుగ తొమ్మిది రోజుల పాటు జరుపుకున్నాక దసరా ని జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఈ దసరా కూడా ఒకటి. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో దసరా మరియు బతుకమ్మను పురస్కరించుకొని పాఠశాలలకు మరియు కళాశాలలకు సెలవులను ప్రకటిస్తుంది. ఈ ముఖ్యమైన పండుగకి అందరు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లి అందరూ కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హిందూమతం (Hinduism) ప్రకారం, రాక్షస పరిపాలకుడైన రావణుడు సీత దేవిని అపహరించడం వల్ల, శ్రీ రామచంద్రుడు సీతా దేవి కోసం యుద్ధం చేసి రావణ సంహారం చేసాడు. శ్రీ రాముని విజయానికి (Victory) సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దీని తో పాటు మహిషాసున అనే రాక్షసుడిని దుర్గా దేవి (Goddess Durga) అంతం చేసి విజయం సాధించిన సూచికగా కూడా జరుపుకుంటారు. అంటే చెడుపై మంచి విజయం సాదించినందు వల్ల ఇది జరుపుకుంటారు. దసరా అయిపోయిన కొన్ని రోజులకే దీపావళి (Diwali) కూడా జరుపుకుంటారు.
Also Read :Prevent Viral Diseases with Ayurveda : వైరల్ వ్యాదులను ఆయుర్వేద మూలికలతో నివారించండి ఇలా…
తెలంగాణ రాష్టం ఈ సంవత్సరం లో రాబోయే దసరా కి ఈ నెల 13 నుండి సెలవులు ప్రకటించింది. దసరా మరియు బతుకమ్మ పండుగలను (Bathukamma festival) పురస్కరించుకొని అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 25 వరకు సెలవులు ప్రకటించింది. ఈ సంవత్సరం లో దసరా పండుగకి 13 రోజులు సెలవులు ఇచ్చారు. రాష్ట్రము లో ఉండే అన్ని పాఠశాలలు (Schools) మరియు కళాశాలలు (Colleges), ఈ సెలవులని పాటించాలని విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్మీడియట్ (Intermediate) చదివే పిల్లలకు మాత్రం అక్టోబర్ 19 నుండి 25 వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ వెల్లడించింది. అక్టోబర్ 26న మళ్ళీ తరగతి తలుపులు తెరుచుకుంటాయి. ఇందులో అక్టోబర్ 22న దసరాని జరుపుకోగా , అక్టోబర్ 24న దుర్గాష్టమి మరియు అదే రోజు బతుకమ్మని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2023-24 లో మొత్తం పాఠశాల పని దినాలు 229 రోజులు.
Also Read : బరువు తగ్గడానికి మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉత్తమ గ్రీన్ టీలు
ఆంధ్రప్రదేశ్ రాష్టం (Ap ) లో కుడా దసరా సెలవులని ప్రకటించిన ప్రభుత్వం. ఇక అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు మరియు కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్టం లో కుడా కూడా జూనియర్ కాలేజీలకు దాదాపు 5 లేదా 6 రోజులు దసరా సెలవులు (Dussehra holidays) ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు షెడ్యూలును ఏపీ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.