Telugu Mirror: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో మహా నటీనటులు తమదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకొని తమకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. తాము లేకపోతే సినీ పరిశ్రమ చిన్నబోతుందన్నట్టుగా నటనలో నిమగ్నమైయ్యేవారు .క్యారెక్టర్ ఏదైనా గాని ఆ పాత్రకు రెట్టింపు న్యాయం చేసి తమదైన శైలితో ప్రజల మనసులకు ఎంతోగానో దగ్గరయ్యారు . కానీ చిన్న వయసులోనే మృత్యు వడిలో చేరి సినీ పరిశ్రమ కు తీరని లోటు మిగిల్చారు . చిన్న వయసులోనే మరణించిన నటీనటుల గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం .
1. సిల్క్ స్మిత (silk smitha):
నిరుపేద కుటుంబం లో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. సినీనటి కావాలనే కోరిక ఆమెను ప్రముఖ నటిగా నిలబెట్టగలిగింది . సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉన్నారు. ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమవ్వడం , చిత్ర నిర్మాణ సమయంలో నష్టాలు రావడం దానికి తోడు మద్యం మత్తులోకి వెళ్లినందువల్ల తాను ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు . అయితే ఆమె 23 సెప్టెంబర్ 1996 అనగా తను 35 సంవత్సరాల వయసులోనే స్వర్గస్తులు అయ్యారు.
2. సౌందర్య (soundhrya):
సౌందర్య గారి పేరు వినగానే గొప్ప నటి అనే విషయం వెంటనే గుర్తుకు వస్తుంది . 100 కు పైగా సినిమాలల్లో నటించిన ఈ అందాల తార సినీ పరిశ్రమ కు చెరగని ముద్ర వేసింది. నూరేళ్ళ ఆయుష్షు నిండకుండానే 27 సంవత్సరాలకే ఈ లోకం వదిలి వెళ్లి అందరి మనసులో దుఃఖాన్ని నింపింది . ఈమె 17 ఏప్రిల్ 2014 లో బెంగుళూరు లో జరిగిన ప్రమాదం లో మరణించింది .
3. ఫటాఫట్ జయలక్ష్మి(jayalakshmi):
ఫటాఫట్ జయలక్ష్మి గా పేరు పొందిన జయలక్ష్మి రెడ్డి దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన నటి. మలయాళం లో “సుప్రియ” అనే పేరు తో పిలవబడుతున్న ఈ ముద్దు గుమ్మ 66 చిత్రాలలో నటించింది .1980 లో తన ప్రేమ విఫలమైనందున 22 ఏళ్లకే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.
4. దివ్య భారతి(Divya Bharathi):
ఉత్తరాధి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చి మంచి పేరుని సంపాదించుకున్న నటి దివ్య భారతి . ఈ ముద్దు గుమ్మ దక్షిణాదిలో కొన్ని సినిమాలల్లో హిట్ కొట్టింది .సుమారు 14 సినిమాలల్లో నటించిన దివ్య భారతి ఏప్రిల్ 5 1993 లో తాను 19 సంవత్సరాల వయసు ఉండగానే అనుమానాస్పద మరణనికి పాల్పడింది .ఈమె మరణానికి గల కారణం ఇంకా అంతుపట్టకుండానే ఉంది.
5. ఆర్తి అగ్గార్వాల్ (Arthi Agarwal):
గుజరాతి కుటుంబానికి చెందిన ఆర్తి అద్భుతంగా నటించి మంచి మెప్పును పొందింది . మంచి సినిమాలు చేసి హిట్స్ కొట్టిన ఆర్తి పెళ్లి అయ్యాక మల్లి సినిమాల్లోకి రావాలని అనుకుంది అయితే సినిమాల కోసం బరువు తగ్గడానికి ఈమె చేసిన ప్రయత్నమే ఆమె ప్రాణాలు మీదకు తీసుకొని వచ్చింది.ఈమె కు 31 సంవత్సరాలు ఉండగానే ఆపరేషన్ విఫలమై 6 జూన్ 2015 లో మరణించారు.
6.ఉదయ్ కిరణ్(Uday Kiran):
ఉదయకిరణ్ మొదటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో హ్యాట్రిక్ హీరో అనే బిరుదును సంపాదించుకున్నాడు. మంచి విజయాలతో ముందుకు సాగి అందరి మనస్సులని దోచుకున్న ఈ అందగాడు మానసిక క్షోభకు గురై మద్యం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు . తన 33 ఏళ్ళ వయసులో అనగా జనవరి 5 2015 లో మరణించారు .