TET Exam Started In Telangana: తెలంగాణలో ప్రారంభమయిన ‘టెట్’ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి.
మే 20 నుంచి జూన్ 2 వరకు తెలంగాణలో టెట్. రోజుకు రెండు సెషన్ల చొప్పున టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో టెట్ పరీక్షలు.
TET Exam Started In Telangana: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నారు. టెట్ పరీక్ష ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 20 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించారు, పేపర్ 1కి 99,958 మంది, పేపర్ 2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లతో కలిపి 2,86,386 మంది టెట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారని టెట్ కన్వీనర్ నివేదించారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈరోజు నుండి జూన్ 6 వరకు జరుగుతుందని టెట్ కన్వీనర్ (TET Convenor) తెలిపారు.టెట్ రోజుకు రెండు సెషన్లలో జరుగుతుంది ఉదయం 9 నుండి 11.30 మరియు 2 గంటల నుండి 4.30 వరకు సాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 80 ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్ టెట్ కన్వీనర్ తెలిపారు. మేడ్చల్ (medchal) లో 25 కేంద్రాలు, రంగారెడ్డి (Rangareddy) లో పదిహేడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షలు పేపర్ 1 మరియు పేపర్ 2 అనే రెండు పేపర్లను కలిగి ఉంటాయి, టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయని టెట్ కన్వీనర్ చెప్పారు.
Also Read: TS EAPCET Results 2024 : తెలంగాణలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు, ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకోగా, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో కేంద్రాలు ఉన్నాయి.టెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. టెట్ అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానాన్ని (Bio Metric System) అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయబడతాయి. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
Comments are closed.