TG School Timings : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స్కూల్ టైమింగ్స్​ మారాయ్.

తెలంగాణ ప్రభుత్వం హైస్కూల్ పని వేళలను సవరించింది. ఎలిమెంటరీ మరియు సెకండరీ స్కూల్స్‌తో సమానంగా హైస్కూల్ వేళలను మార్చింది.

TG School Timings : తెలంగాణ ప్రభుత్వం హైస్కూల్ పని వేళలను సవరించింది. ఎలిమెంటరీ మరియు సెకండరీ స్కూల్స్‌తో సమానంగా హైస్కూల్ వేళలను మార్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సాధారణ పని వేళలను ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇకపై ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కాకుండా ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నిర్వహణ వేళలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ఉత్తర్వుల ద్వారా ఈ మేరకు ఉన్నత పాఠశాలల నిర్వహణ వేళలను మార్చింది.

రాష్ట్రంలోని ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలు యథావిధిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు పనిచేస్తాయని విద్యాశాఖ తెలిపింది.

సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల నిర్వహణ యథావిధిగా కొనసాగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

TG School Timings విద్యాశాఖ ఫ్రేమ్‌వర్క్‌ను మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం అంగన్‌వాడీ తరహాలో ప్లే స్కూళ్లను రూపొందించి మూడో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయుడిని నియమించనున్నారు.

ట్రాఫిక్ కార‌ణాల దృష్ట్యా హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో పాఠశాలల్లోని పని వేళల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ పాఠశాలలో విద్యుత్ తో పాటు మరుగు దొడ్లు ఉండేలా చర్యలు తీసుకోనుంది.

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారుల బదిలీలు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా వరకు టైమ్ కు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది అయితే పాఠశాల ప్రారంభం అయిన రెండు మూడు గంటలకు వస్తున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

TG School Timings

Comments are closed.