ఈ మధ్యకాలంలో జంక్ (Junk) ఫాస్ట్ ఫుడ్ (Fast food) మరియు స్ట్రీట్ ఫుడ్స్ (Street food) కు ప్రజలు విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు. వ్యాపారస్తులు బాగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో నాణ్యత (Quality) లేని ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. దీంతో ఆ ఆహారం తిన్నవారికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (Bacterial Infections), డయేరియా (Diarrhea) మరియు టైఫాయిడ్ (Typhoid) వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది.
మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఘుమఘుమలాడే సువాసనతో, ముక్కు పుటాలను తాకుతాయి. అప్పుడు మనకు తెలియకుండానే మనం వాటిని తినడానికి వెళుతుంటాం. కానీ వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి మర్చిపోయి తినేందుకు వెళుతున్నాం. తిన్నాక కొన్నిసార్లు వాటి వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాళ్లు వండే వంటలలో నాణ్యత ఉండదు కాబట్టి. చూడడానికి చాలా కలర్ ఫుల్( Color full) గా మరియు ఘుమఘుమలాడే సువాసనలతో ఉండటంవల్ల మనం వాటిని తినేందుకు ఇష్టపడుతున్నాం. అయితే స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం
14 సంవత్సరాల బాలిక చికెన్ షవర్మ తిని అస్వస్థకు గురై ఆస్పత్రి పాలైంది. చివరికి ప్రాణాలు కోల్పోయింది.
ఈ విషాద సంఘటన ఎక్కడ, ఎలా జరిగింది అనే విషయం వివరంగా తెలుసుకుందాం.
తమిళనాడులోని నమ్మక్కళ్ కు చెందిన ఒక వ్యక్తి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ (Restaurant) కి సెప్టెంబర్ 15 ఆదివారం వెళ్ళాడు. అక్కడ చికెన్ షవర్మ (Chicken Shawarma) మరియు మరికొన్ని నాన్ వెజ్ (Non-veg) కి సంబంధించిన ఫుడ్ కూడా కొని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తర్వాత ఆ ఫుడ్ ని అతను, అతను భార్య, కుమార్తె ముగ్గురూ తిన్నారు. అదే రోజు రాత్రి అతని కుమార్తె కు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంది. వెంటనే ఆ పాప ను తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి ఫుడ్ పాయిజన్ (Food poison) అయిందని తెలిపారు.
డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత ఇంటికి పంపించారు. కానీ ఆ తర్వాత రోజే బాలిక మరణించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో ఆ వ్యక్తి రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేశారు. వెంటనే దానిని మూసివేయాలని డిమాండ్ చేశారు.
అయితే కొన్ని రోజుల క్రితం అదే రెస్టారెంట్ లో నాన్ వెజ్ ఫుడ్ తిని సుమారు 13 మంది మెడికల్ (Medical) స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ రెస్టారెంట్ పై తనిఖీ చేశారు. అక్కడ ఫుడ్ శాంపిల్స్ (Food samples) తీసుకొని ల్యాబ్ (Lab) కు పంపించారు. రెస్టారెంట్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ఎండు ద్రాక్ష , పెరుగు కలిపి తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
ఆ రెస్టారెంట్ లో కుళ్ళిపోయిన మరియు పాడైపోయిన చికెన్ తో చికెన్ షవర్మ, తందూరి (Tandoori), గ్రిల్డ్ చికెన్ (Grilled chicken) తయారు చేస్తున్నారని అందువల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు విచారణలో బయటపడింది. వారు చికెన్ (Chicken) ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మరియు ఎన్ని రోజుల నుంచి నిలువ చేసి వండుతున్నారు అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాబట్టి బయట ఫుడ్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు బయట ఫుడ్ కు దూరంగా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.