Telugu Mirror : ICC మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఈరోజు ఆఫ్గనిస్తాన్ (Afganisthan) మరియు నెదర్లాండ్స్ (Netherlands) మధ్య కీలక పోటీ జరగనుంది. అధిక విజయాలు సాధిస్తూ వస్తున్న ఆఫ్గనిస్తాన్ మరియు నెదర్లాండ్స్ మధ్య జోరుగా పోరుకి సిద్ధం అయ్యారు. నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాట్టింగ్ ని ఎంచుకుంది. లక్నో (Lucknow)లోని ఏకానా స్టేడియం లో వీరి మధ్య పోటీ జరగనుంది.
లక్నోలోని ఏకానా స్టేడియం పూర్తిగా బౌలింగ్ పిచ్ కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చేసింగ్ చేయడం కొంచం కష్టమైన పని అని చెప్పవచ్చు. భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇది స్పష్టంగా తెలిసింది. 230 పరుగుల లక్ష్యాన్ని కూడా ఇంగ్లాండ్ ఛేదించి గెలవలేకపోయింది. ఆఫ్గనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లను ఓడించగా, ఇటు నెదర్లాండ్స్ బాంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రిక జట్లని ఓడించింది. అయితే ఆఫ్గనిస్తాన్ ఈ మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్లతో నెదర్లాండ్స్ తో తలపడనుంది.
World Stroke Day 2023 : అక్టోబర్ 29 ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం, చరిత్ర మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి
ఇరు జట్లకు సెమీ ఫైనల్స్ కి చేరుకోవడానికి ఇది కీలకమైన మ్యాచ్. ఆఫ్గనిస్తాన్ ఆడిన 6 మ్యాచుల్లో 3 మ్యాచులు గెలిచాయి మరో 3 మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆఫ్గనిస్తాన్ సెమీస్ కి చేరాలి అంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి మరియు దీంతో పాటు రాబోయే రెండు మ్యాచుల్లో కూడా విజయం సాధించాలి. అలా సాధిస్తే ఆఫ్గనిస్తాన్ సెమీ-ఫైనల్ కి చేరుకుంటుంది.
Rohith Sharma : నాకౌట్ మ్యాచ్ లో ఓడిపోతే అందరూ నన్ను బ్యాడ్ కెప్టెన్ అంటారు
ఇక నెదర్లాండ్స్ కి కూడా సెమీస్ కి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆడిన 6 మ్యాచుల్లో రెండు విజయాల్ని మాత్రమే సాధించి మిగిలిన 4 మ్యాచులు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ కి సెమీఫైనల్ కి వెళ్లే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ ని గెలవాల్సి ఉంటుంది. టాస్ వేసే సందర్భంలో సెమీ-ఫైనల్ కి చేరడమే ప్రధాన లక్షమని డచ్ కెప్టెన్ చెప్పాడు.
ఈసారి ప్రపంచ కప్ లో ఈ ఇరు జట్లు అంచనాలను మించి ఆడుతున్నాయి. ఇంగ్లాండ్,బాంగ్లాదేశ్ కంటే మంచిగా తమ ఆటను కొనసాగిస్తున్నాయి. ఆఫ్గనిస్తాన్ శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లను ఓటమి పాలయ్యేలా చేసింది. ఆఫ్గనిస్తాన్ ఈ మ్యాచ్ ని తప్పక గెలవాలి.
ఆఫ్గనిస్తాన్ vs నెదర్లాండ్స్ :
ఆఫ్గనిస్తాన్ : స్కాట్ ఎడ్వర్డ్స్, రహ్మానుల్లా గుర్బాజ్ (VC), ఇబ్రహీం జర్దాన్, రహ్మత్ షా, బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్, అబ్దుల్లా ఒమర్జాయ్, కోలిన్ అకెర్మాన్, రషీద్ ఖాన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెర్న్
నెదర్లాండ్స్ : విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, వెస్లీ బరేసి, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (c & wk), బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.