Telugu Mirror : గత సంవత్సరం విడుదల అయిన Xiaomi 12T Pro కు సక్సెసర్ గా Xiaomi 13T Pro త్వరలోనే విడుదల కాబోతుంది. Xiaomi 13T Pro గీక్ బెంచ్ వెబ్ సైట్ లో 23078PND5G మోడల్ నెంబర్ తో టెస్టింగ్ లో పాల్గొంది. ఇలా Xiaomi 13T Pro కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్ లు లీక్ అయ్యాయి.Xiaomi 13T Pro ను MySmartPrice వారు గీక్ బెంచ్ వెబ్ సైట్ లో గుర్తించారు. 23078PND5G మోడల్ నెంబర్ తో టెస్టింగ్ లో పాల్గొన్న Xiaomi 13T Pro 1,289 సింగిల్ కోర్ స్కోర్ ను సంపాదించుకుంది మరియు 3,921 మల్టీ కోర్ స్కోర్ ను సాధించింది.
Telugu Panchangam : తెలుగు మిర్రర్ న్యూస్ ఈ రోజు ఆదివారం, జూలై 9, 2023 తిథి ,పంచాంగం
Xiaomi 13T Pro ఆండ్రాయిడ్ వెర్షన్ 14 బదులు వెర్షన్ 13 తో రానుంది. ఈ హ్యాండ్ సెట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రాబోతుంది. నాలుగు కోర్ లు 2.00Hz తో, మూడు కోర్ లు 3.00Hz తో మరియు ఒక కోర్ 3.35Hz తో రాబోతుంది. వీటిని చూస్తుంటే Xiaomi 13T Pro పెద్ద ప్రాసెసర్ తోనే రావచ్చని అంచనా. గత ఏడాది విడుదల అయిన Xiaomi 12T Pro Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ తో వచ్చింది. Xiaomi 13T Pro MediaTek Dinensity 9200+ SoC చిప్ సెట్ తో వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Treads : ట్విట్టర్ కు పోటీగా మెటా థ్రెడ్స్.. 2 గంటల్లోనే 90 మిలియన్ సైన్అప్స్..
12T Pro 8GB, 12GB RAM మరియు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్ లలో విడుదల అయ్యింది. Xiaomi 13T Pro 12GB, 16GB RAM మరియు 256GB లేదా 512GB స్టోరేజ్ వేరియంట్ లలో రావచ్చు. ఒక సారి ఈ ఫోన్ IMDA సర్టిఫికేషన్ సైట్ లో కనిపించింది. దాని ప్రకారం Xiaomi 13T Pro 12GB + 512GB వేరియంట్ యొక్క ధర £799 ( దాదాపు రూ.83,000 ) ఉండవచ్చు. Xiaomi 12T Pro 5000mAh బ్యాటరీతో విడుదల అయ్యింది. అలానే ఈ ఫోన్ 120W ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల అయ్యింది.
అలాగే Xiaomi 13T Pro 5000mAh బ్యాటరీతో రావచ్చు. ప్రస్తుతానికి 64W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అనుకుంటున్నారు. 12T Pro మూడు కెమెరాలతో వచ్చింది. ఈ ఫోన్ లో కెమెరానే ప్రత్యేక ఆకర్షణీయ అంశం. ఈ హ్యాండ్ సెట్ 200MP+ 8MP+ 2MP కెమెరా లెన్స్ తో వచ్చింది. కాబట్టి 13T Pro యొక్క కెమెరాపై పెద్ద ఆశలే పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి లీక్ అయిన స్పెసిఫికేషన్ లు ఇవి మాత్రమే, ఈ ఫోన్ త్వరలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.