Telugu Mirror : ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయడం వలన శరీరం వ్యాధులతో పోరాడే శక్తి, సామర్థ్యాలను బలపరుస్తుంది. అనేక రకాల వ్యాధులకు, వివిధ రకాల యోగాసనాలు(Yoga) ఉన్నాయి. యోగ సాధన వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు. ఆడవారికైనా, మగవారికైనా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యోగ లేదా వ్యాయామం గర్భవతి అయిన వారు కూడా చేయడం వలన చాలా మేలు చేస్తుంది.సాధారణ సమయంలో మహిళలు వారి శరీరంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో బిడ్డ మరియు తల్లి ఆరోగ్యంగా ఉండడం కోసం తల్లి తన శరీరంపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
Tips for glowing Skin : నాచురల్ చిట్కాలతో సహజసిద్ధముగా మెరిసే చర్మం మీ సొంతం..
తద్వారా ఆమె డెలివరీ సమయానికి శారీరకంగా మరియు మానసికంగా సిద్ధంగా ఉంటుంది.కాబట్టి అటువంటి సందర్భంలో నిపుణులు ఏమని సిఫారసు చేస్తున్నారంటే పోషకాహారం మరియు పానీయాలతో పాటు తేలికపాటి వ్యాయామం చేయమని సూచిస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో యోగ సాధన చేయడం వలన ఆరోగ్యసమస్యలను చాలా వరకు తగ్గించవచ్చు. మీలో ఎవరైనా గర్భవతిగా ఉంటే యోగా చేయాలని ఆలోచన మీకు ఉన్నట్లయితే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భధారణ సమయంలో యోగా చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోవాలి.
- గర్భధారణ సమయంలో అన్ని రకాల యోగాలను చేయకూడదు. శిక్షణ తీసుకున్న యోగా గురువు సలహా మేరకు మాత్రమే యోగా చేయాలి. పొట్టని బలవంతంగా మరియు సాగదీసే యోగాసనాలను గర్భదారణ సమయంలో చేయకూడదు. అనగా గర్భవతి అయిన వారు భుజంగాసనం, చక్రాసనం,ధనురాసనం,మొదలైనవి చేయకూడదు.
- గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో నిల్చుని యోగాసనాలు చేయవచ్చు. దీనివలన కాళ్ళ యొక్క కండరాలు బలోపేతం అవుతాయి. అటువంటి యోగాసనాలు చేయడం వలన దేహంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఈ యోగ సాధన ద్వారా పాదాలలో వాపు కూడా తగ్గుతుంది.
- గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత శరీర అలసిపోయేంత మరియు మరింత చురుకైన యోగాసనాలను చేయకూడదు. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రాణాయామం మరియు ధ్యానం చేయవచ్చు.
- గర్భం దాల్చిన నాలుగు మరియు ఐదు నెలలో యోగాలు చేయకూడదు. ఈ సమయం గర్భిణీ స్త్రీలకు అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది. కాబట్టి వైద్యుల సలహా మేరకు మాత్రమే యోగా లేదా వ్యాయామం చేయాలి.
- గర్భం దాల్చిన ఆరంభంలో మీ యొక్క భుజాలు మరియు పైభాగాన్ని బలోపేతం చేసే యోగలేదా వ్యాయామం చేయాలి. అలాగే యోగా చేయాలనుకుంటే మీ శరీరం యొక్క సామర్థ్యాన్ని బట్టి చేయాలి.
కాబట్టి గర్భిణీ స్త్రీలు యోగ లేదా వ్యాయామం చేయాలనుకుంటే వైద్యుల సలహా తీసుకొని మాత్రమే చేయాలి. ఇంటర్నెట్ మరియు యూట్యూబ్ వీడియోలను చూసి పాటించ కూడదు.