Telugu Mirror : ఇప్పుడు ఓటీటీ సినిమాలు వారం వారం పోటీ పడుతున్నాయి. ఇలా ఒకేసారి ఓటీటీలో విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెరిగిపోతూ ఉంది. అయితే ఈ మధ్య కాలం లో ఓటీటీలో రిలీజ్ అయినా చిత్రాల్లో టాప్ 3 బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు మేము మీకు తెలియజెస్తున్నాము. ఈ వారాంతంలో చూడాల్సిన టాప్ 3 తాజా OTT చిత్రాలు వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
1. ఊరు పేరు భైరవకోన :
సందీప్ కిషన్ తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో రీసెంట్‌గా హిట్టు కొట్టాడు . ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 16న థియేటర్లో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరి ఈ చిత్రం ఎందులో రిలీజ్ అవుతుందో చూద్దాం. ఊరు పేరు భైరవకోన సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో రిలీజైన ఒక నెల లోపే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రవిశంకర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో కనిపించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
Also Read : Zero Current Bill: రేషన్ కార్డు ఉంటే చాలు ఇక కరెంటు బిల్ జీరో, గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
2. 12Th ఫెయిల్ :
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ + హాట్‌స్టార్‌లో మంగళవారం ఉదయం నుంచి తెలుగులో ప్రసారమవుతుతున్నది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో దీనిని తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమాగా ఇది రికార్డ్‌కెక్కింది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్ సాధించింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.
Also Read : Free 1 Thulam Gold In Telangana:మహిళలకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, ఉచితంగా తులం బంగారం, ఎప్పటి నుండో తెలుసా?
3. అన్వేషిప్పింగ్ కండెతుమ్ :
టోవినో థామస్ తెలుగు ప్రేక్షకులందరికి తెలియకపోవచ్చు కానీ ఆయన నటించిన సినిమాల పేరు చెబితే చాలా మంది తెలుగు వారు గుర్తు పడతారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన 2018 సినిమా గుర్తింది కదా వందకోట్లకు పైగా వసూలు చేసిన ఈ మలయాళ హిట్ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు టోవినో థామస్. ఇక ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా అన్వేషిప్పన్ కండతుమ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.