Tillu Square OTT Streaming : ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Tillu Square OTT Streaming

Tillu Square OTT Streaming : సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చిత్రంగా టిల్లు స్క్వేర్ నిలిచిపోయింది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu jonnalagadda)ఎప్పటిలాగే తనదైన శైలిలో పంచుల్ని, డైలాగ్ డెలివరీతో అలరించాడు. గతంలో వచ్చిన సూపర్ పాపులర్ చిత్రం డీజే టిల్లుకు ఈ సీక్వెల్ వచ్చి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించింది. కేరళ కుట్టి లిల్లీగా తన నటనతో యువత  హృదయాలను దోచేసింది. అయితే టిల్లు స్క్వేర్ రిలీజ్ తర్వాత అనుపమ క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటనకు అభిమానులు ఆశ్చర్యపోయారు. నేహా శెట్టి, ప్రియాంక జవాల్కర్ కూడా అతిధులుగా కనిపించారు.

ఈ సినిమా కూడా యూఎస్ మార్కెట్ (US market) లో స్టార్ హీరోల సంఖ్యతో సరికొత్త రికార్డు సృష్టించింది. OTTలో ఈ సినిమా విడుదల తేదీ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఈ చిత్రం ఇప్పుడు OTTలో విడుదలైంది. ప్రముఖ OTT ప్రొవైడర్ నెట్‌ఫ్లిక్స్లో (Netflix) టిల్లూ స్క్వేర్ డిజిటల్ స్ట్రీమింగ్ (Digital streaming) హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Tillu Square OTT Streaming

టిల్లు స్క్వేర్ విషయానికొస్తే, ఫస్ట్ పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఇట్టే కనెక్ట్ అవుతారు.  తాజాగా ఈ సినిమాకు టిల్లు క్యూబ్ (Tillu Cube) మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల మరియు భీమ్స్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ సినిమా రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి దాదాపు రూ. 40 కోట్ల థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది. మరోవైపు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపేణా మరో రూ. 25 కోట్ల వరకు లాభాను ఆర్జించింది. టిల్లూ క్యూబ్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. త్వరలో నటీనటుల వివరాలను కూడా విడుదల చేయనున్నారు.

Tillu Square OTT Streaming

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in