Tips for Driving in the Rain : వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు తీస్కోవాలిసిన జాగ్రత్తలు.
వర్షపు వాతావరణంలో డ్రైవ్ చేయడం చాల మంది డ్రైవర్లకు సవాలుగా ఉంటుంది, అలంటి సమయంలో తీస్కోవాలిసిన జాగ్రత్తలు మీ కోసం.
Tips for Driving in the Rain :వర్షపు వాతావరణంలో డ్రైవ్ చేయడం డ్రైవర్లకు సవాలుగా ఉంటుంది, దీనికి వివిధ నైపుణ్యాలు మరియు జాగ్రత్తలు అవసరం. విండ్‌షీల్డ్ వైపర్‌లను కరెక్ట్ గ యూజ్ చేస్కుంటూ సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు డ్రైవర్లు తడి పరిస్థితులలో సురక్షితంగా ఎలా డ్రైవ్ చేయాలో మరియు అవసరమైన చిట్కాలు ఇపుడు చూద్దాం.
Preparation:
వర్షంలో డ్రైవింగ్ చేసే ముందు, మీ విండ్‌షీల్డ్ వైపర్‌లు మంచిగా వర్క్ చేస్తున్నాయా లేదా అని చూస్కోండి.
వర్షం స్టార్ట్ అవగానే మీ హెడ్‌లైట్‌లు ఆన్ చేయండి, ఇది మీకు మరియు ఇతర డ్రైవర్‌లకు విజిబిలిటీ పెంచుతుంది.
భారీ వర్షంలో క్లియర్ గ కనిపించడానికి విండ్షీల్డ్ కి కొన్ని లిక్విడ్స్ యూజ్ చేస్తారు అవి యూజ్ చేస్తేయ్ వర్షంలో డ్రైవింగ్ చేసేటప్పుడు క్లియర్ గ కనిపిస్తుంది.
Driving Techniques:
వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వర్షం యొక్క స్పీడ్ ని బట్టి వైపర్ల స్పీడ్ తక్కువ(Low ) లేదా ఎక్కువ(High ) పెట్టండి.
విండో ఫాగింగ్ రాకుండా ఉండటానికి మీ డీఫ్రాస్టర్ మరియు ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించండి.
మీ వాహనం హైడ్రోప్లేన్ కి ఎఫెక్ట్ అయితె (నీటి కారణంగా టైర్స్ రోడ్ తో కాంటాక్ట్ ని కోల్పోతాయి), యాక్సిలరేషన్ వదిలివేయండి, స్టీరింగ్ వీల్‌ను గట్టిగా పట్టుకోండి మరియు మీరు ట్రాక్షన్‌ను తిరిగి పొందే వరకు బ్రేక్స్ వేయకండి.
Following Distance:
మెరుగైన విజిబిలిటీ మరియు రియాక్టింగ్ టైం కోసం ఒక 3 to 5 సెకండ్స్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయండి.
హెవీ వెహికల్స్ కి దూరం గ డ్రైవ్ చేయండి లేకపోతె వాటి టైర్స్ నుంచి వాటర్ స్ప్రే లాగా మీ విండ్షీల్డ్ మీద పది మీకు కనపడకుండా చేస్తుంది.
Avoid Cruise Control:
రోడ్స్ తడిగా ఉన్నపుడు క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించవద్దు, ఇది జారే రోడ్లపై కంట్రోల్ కోల్పోయేలా చేస్తుంది.
Road Conditions:
ముఖ్యంగా దిగువ ప్రాంతాలలో మరియు డ్రైనేజీస్ కి సమీపంలో కార్ డ్రైవ్ చేయకండి.
వర్షం మరియు విండ్‌షీల్డ్ వైపర్‌ల నుంచి వచ్చే శబ్దం పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ శబ్దం ఎక్కువ సేపు వింటూ ఉంటెయ్ డ్రైవర్స్ స్ట్రెస్ ఫీల్ అవుతారు.
Night Driving:
రాత్రిపూట వర్షంలో డ్రైవింగ్ చేయడం కొంచం ఇబ్బంది ఎందుకంటె గ్లేర్ మరియు తడి రహదారి రిఫ్లెక్షన్ వాళ్ళ రోడ్ సరిగ్గా కనిపించదు.
తక్కువ స్పీడ్ తో వెళ్లడం మరియు రోడ్ కండిషన్స్ సడన్ గ చేంజ్ అయిన కూడా రియాక్ట్ అవడానికి రెడీ గ ఉండండి.
Tire Safety:
హైడ్రోప్లానింగ్‌ను నిరోధించడానికి మీ టైర్స్ తగిన గ్రిప్ తో ఉండేలా చూసుకోండి.
మంచి రైన్ టైర్స్ నీటిని డైవర్ట్ చేయడానికి మరియు వెట్ రోడ్స్ లో మంచి ట్రాక్షన్‌ను ఇస్తుంది.
Additional Tips:
మీ వాహనంపై కంట్రోల్ తప్పకుండ ఉండటానికి సడన్ టర్న్స్ లేదా హార్డ్ బ్రేకింగ్ లాంటివి చేయకండి.
ఎత్తైన ప్రదేశాలలో పొగమంచుతో జాగ్రత్తగ ఉండండి, ఎందుకంటే అది మీ విజిబిలిటీని తగ్గిస్తుంది.
వర్షంలో డ్రైవింగ్ చేయడానికి చాల శ్రద్ద మరియు సేఫ్టీ టేక్నిక్స్ అవసరం. ఈ టేక్నిక్స్ ఫాలో అవడం వల్ల, మీరు తడి వాతావరణంలో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు మరియు సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
Comments are closed.