Tirumala Darshan: కలియుగ దైవం అయిన శ్రీనివాసుని జన్మస్థలమైన తిరుమలకు వేలాది మంది భక్తులు తీర్థయాత్రలు చేస్తారు. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొంతమంది తిరమల (Tirumala) కు కాలినడకన వెళ్తే, మరికొందరు బస్సులో లేదా ప్రైవేట్ వాహనాల్లో స్వామిని దర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. వెంకన్న దర్శనానంతరం శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు.
వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. నిన్న భక్తుల సంఖ్య 76,748 కాగా, అందులో 30,688 మంది దేవునికి తలనీలాలు సమర్పించారు. ఆ రోజున తిరుమల (Tirumala) దేవస్థానంలో టీటీడీ (TTD) ఆదాయం దాదాపు 4.10 కోట్లు అందింది.
వేసవి ని దృష్టిలో పెట్టుకొని తిరుమల వెయిట్‌లు మరియు కంపార్ట్‌మెంట్లలో ఆహారం (food), మజ్జిగ, తాగునీరు (water), అల్పాహారం మరియు వైద్య సదుపాయాలు అన్ని వేళలా అందుబాటులో అందేలా చూసారు.
టైం స్లాట్ ఎస్ఎస్డీ దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉండగా 3 గంటలు టైం పడుతుంది. ఇంకా, ప్రత్యేక రూ.300 దర్శనానికి దాదాపు 2 గంటలు సమయం పడుతుంది.
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయ వీధులు, భక్తులు అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో నిత్యం షెడ్లు, కూలెంట్లు, నీరు (Water) చల్లుతున్నారు. క్యూ లైన్, కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులకు నీళ్లు, మజ్జిగ ఇస్తున్నారు.
తిరుమలలో జరిగే వేడుకలు
మే 17-19 తేదీల్లో తిరుమలలో పద్మావతి (Padmavathi) పరిణయోత్సవం జరుగుతుంది.
మే 22న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
మే 21 నుండి 23 వరకు తిరుచానూరు వార్షిక వసంతోత్సవం కొనసాగుతుంది.
మే 23న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో పత్ర పుష్ప యాగం జరుగుతుంది.
మే 27 నుండి 29 వరకు శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవం జరుగుతుంది.
మే 28న స్వర్ణ రథోత్సవం జరుగుతుంది.
జూన్ 1 నుంచి 5 వరకు ఆకాశ గంగ సమీపంలోని బాలాంజనేయ స్వామి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, ఈడో మైలులోని ప్రసన్నాంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.