Tirumala Darshan Tickets Online Available: తిరుమల దర్శనకు ఆర్జిత సేవలు,దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోండి!

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా కార్యక్రమాలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవా టిక్కెట్లు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.

Tirumala Darshan Tickets Online Available: తిరుమల శ్రీవారి భక్తులకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల గురించి ఒక గుడ్ న్యూస్. సెప్టెంబర్ నెల కోటా జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ (Online) లో అందుబాటులోకి వచ్చింది. ఈ సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు చేసుకోవచ్చు.

ఈ టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకి. జూన్ 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీడిప్ (Luckydip) నుంచి టిక్కెట్లు అందుతాయి.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా కార్యక్రమాలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవా టిక్కెట్లు ఉన్నాయి. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌  (TTD Online) లో విడుదల కానుంది. అలాగే జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోసం (కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార) ఆన్‌లైన్‌లో ఆగస్టు లైవ్ కోటాను టీటీడీ పంపిణీ చేస్తుంది.

సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి జారీ చేస్తుంది. వృద్ధులు, వికలాంగులు మరియు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా సెప్టెంబర్‌కు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 22 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌  (Online) లో టిటిడి అందుబాటులో ఉంచుతుంది.

జూన్‌ 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్‌ (Special  Darshan Ticket) కేటాయింపు రూ.300ను టీటీడీ పంపిణీ చేయనుంది. అలాగే సెప్టెంబర్‌ నెలలో తిరుమల, తిరుపతిలో వసతి కోటాను జూన్‌ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే జూన్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవా కోటాను ఇవ్వనున్నారు. భక్తులు తమ టిక్కెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయాలని టీటీడీ కోరింది.

Tirumala Darshan

Also  Read: NTR Barosa Scheme: ఆ పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ పేరు తొలగింపు

శుక్రవారం తన కార్యాలయంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం (JEO Veera Brahmam) ఆవిష్కరించారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 16న అంకురార్పణ, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని జేఈవో తెలిపారు.

జూన్ 21న గరుడసేవ,

జూన్ 22న హనుమాన్ వాహనం,

జూన్ 24న రథోత్సవం,

జూన్ 25న చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో శుక్రవారం భక్తులు రక్తదానం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 14 మంది భక్తులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కుసుమ కుమారి (Doctor Kusama Kumari) , డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి, హెడ్ నర్సు శ్రీమతి సావిత్రి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments are closed.