Tirumala Darshanam Free: తిరుమల దర్శనం ఇప్పుడు ఉచితంగా, ఎవరికంటే?

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వికలాంగులు, వృద్ధులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టారు.

Tirumala Darshanam Free: తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తిరుమల భక్తులతో మరింత రద్దీగా మారింది. అయితే, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వికలాంగులు, వృద్ధులకు టీటీడీ శుభవార్త అందించింది. వారికి ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. వీరికి మాత్రమే రోజుకు ఒకసారి ప్రత్యేక స్లాట్‌ను కేటాయిస్తూ టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఉంటుంది.

ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనం :

పార్కింగ్‌ స్థలం నుంచి ఆలయ ద్వారం వద్ద ఉన్న కౌంటర్‌ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ రవాణా అందుబాటులో ఉంటుందని టీటీడీ చెప్పింది. వృద్ధులు మరియు దివ్యాంగులకు రిజర్వ్ చేసిన సమయంలో మిగిలిన లైనప్‌లను ముగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు వెళ్లిపోవచ్చు. అలాగే వృద్ధులు, వికలాంగులు రెండు లడ్డూలను రూ.20కి కొనుగోలు చేయవచ్చని టీటీడీ పేర్కొంది.

ఈ అవకాశానికి ఎవరు అర్హులు ?

సీనియర్ సిటిజన్ల (Senior Citizens) కు కనీసం 65 ఏళ్లు ఉండాలి. వికలాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ (Open heart Surgeory) , కిడ్నీ ఫెయిల్యూర్ (Kidney Failure) , క్యాన్సర్ (Cancer) , పక్షవాతం, ఆస్తమా ఉన్నవారు ఉచితంగా తిరుమలకు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు. వృద్ధులు నడవలేని స్థితిలో ఉంటే, వారితో పాటు పక్కన ఒకరు రావచ్చు.

 

Tirumala Special occasions

Also Read:Tirumala Tirupati Venkateswara Swamy: ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా దర్శనం, పూర్తి వివరాలివే.

అవసరమైన పత్రాలు:

ID రుజువుగా ఆధార్ కార్డ్ అవసరం. వికలాంగులు తప్పనిసరిగా తమ ID కార్డ్‌ని తీసుకురావాలి. ఫిజికల్ చాలేంజ్డ్ సర్టిఫికేట్ (Physical Challenge Certificate) , ఆధార్ కార్డ్ తీసుకొనిరావాలి. వృద్ధాప్యం లేదా వైకల్యం కాకుండా పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ / స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సెర్టిఫికెట్, అలాగే ఆధార్ కార్డ్‌ను అందించాలి.

స్లాట్‌ని ఇలా బుక్ చేసుకోవాలి :

వృద్ధులు మరియు వికలాంగులు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌ (Online) లో తమ దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. దాని కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. టిక్కెట్లు ఉచితంగా రిజర్వ్ చేసుకోవచ్చు. మొదటి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం (అధికారిక బుకింగ్ పోర్టల్) వెబ్‌సైట్ కి వెళ్ళండి. హోమ్ పేజీలో, ఆన్‌లైన్ సర్వీసెస్ ఆపై డిఫరెంట్లీ ఏబుల్డ్/సీనియర్ సిటిజన్ దర్శన్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. ఆపై మీ సెల్ నంబర్ మరియు మీకు ఫోన్ నంబర్ కి వచ్చిన OTPని నమోదు చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు, సీనియర్ సిటిజన్/మెడికల్ కేసులు/డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే కేటగిరీ ఎంపికలో, ఈ మూడు ఆప్షన్ లలో ఒకదాన్ని ఎంచుకోండి. తర్వాత, స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటారో తేదీని ఎంచుకోవడం. ఆ తర్వాత మిగిలిన సమాచారాన్ని నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోండి.

Comments are closed.