Tirumala Darshanam Update: తిరుమల వెళ్లే భక్తులకు గమనిక. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. వీకెండ్స్ మరియు వేసవి సెలవుల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని హాళ్లు, నారాయణగిరిలోని షెడ్లు యాత్రికులతో కిక్కిరిసిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ (Krishna Teja Guest House) నుంచి శిలాతోరణం సర్కిల్ వరకు రింగ్ రోడ్డు వెంబడి దాదాపు కిలోమీటరు మేర కొండ పై భక్తుల క్యూ లైన్లలో నిలుచొని ఉన్నారు. శ్రీవారి భక్తులకు దాదాపు 20 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది.
తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పరుగులు తీస్తున్నారు. తిరుమలలో భక్తుల సంఖ్య మళ్లీ పెరగడంతో శ్రీవారి సర్వదర్శనం కోసం ఎస్‌ఎస్‌డి టోకెన్లు (SSD Tokens) లేకుండా వెళ్లేవారు వేచి ఉండే అవకాశం ఉందని టిటిడి తాజాగా నివేదించింది.
క్యూలో ఉన్న వారికి ఆహారం, నీరు, పాలు సరఫరా చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ సముదాయంతో పాటు మాడవీధి, అఖిలాండ్, లడ్డూ కౌంటర్, అన్నప్రసాద కేంద్రం, లేపాక్షి సర్కిల్, బస్టాండ్‌లో భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమల రింగ్‌రోడ్డు (Tirumala Ring Road) వద్ద క్యూలైన్‌లో అడవి పందులు రావడంతో భక్తులు భయానికి గురయ్యారు.
Also Read: Tirumala Darshanam Free: తిరుమల దర్శనం ఇప్పుడు ఉచితంగా, ఎవరికంటే?
తిరుమల వసతి గృహాల్లో ఇబ్బంది ఏంటంటే.. 300 రూపాయలతో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు శ్రీవారికి చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు (TTD Officers) అన్ని చర్యలు చేపట్టారు. అయితే తిరుమలకు వచ్చే వారికి స్థలాలు దొరకడం కష్టంగా మారింది. దర్శనం కోసం క్యూలో నిల్చున్న వారికి ఆహారం, తాగునీరు, పాలు అందిస్తున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనం కోసం అమిత్ షా (Amith Shah) స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ, సుప్రభాత అభిషేకం, వీఐపీ బ్రేక్ దర్శనం ఉన్నందున సామాన్య భక్తుల దర్శనం మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.