Tirumala Earned Services, Darshanam July Quota Release Dates : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో జూలై నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. అదేరోజు అంటే ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లను భక్తులకు మంజూరు చేస్తారు. ఆర్జిత సేవా టికెట్ లను పొందిన భక్తులు రుసుము చెల్లించి వారి టికెట్ లను ఖరారు చేసుకోవాలని టీటీడీ తెలిపింది. ఆర్జిత సేవా టికెట్ ల లక్కీ డిప్ అనంతరం ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల.కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జూలై నెలకు సంభంధించిన వర్చువల్ సేవల కోటా విడుదల తేదీ
ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో జరిగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జూలై నెలలో అంగప్రదక్షిణం టోకెన్ ల విడుదల తేదీ
ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జూలై నెల శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11గంటలకు జులై నెల శ్రీవాణి ట్రస్టు టికెట్ లకు సంబంధించిన ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
జూలై నెలలో వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల ఎప్పుడంటే?
ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో జూలై నెలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జూలై నెల కోటా విడుదల
ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ రూ.300 కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటా విడుదల
ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో జులై నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
శ్రీవారి సేవ కోటా విడుదల తేదీ
ఏప్రిల్ 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ టికెట్ లను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ టికెట్ లను, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ టికెట్ లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. కావున శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనంలో ఉంచుకొని శ్రీవారి సేవలు, దర్శనం, వసతి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు.
టీటీడీ ఆధ్వర్యంలో.. ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు ఒంటిమిట్ట కోదండ రామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరుగనున్నాయి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…