Tirumala Special occasions: ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రాల్లో తిరుమల (Tirumala) ఒకటి. తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠ దివ్య క్షేత్రంగా యుగయుగాల నుంచి దర్శించుకున్న క్షేత్రం. అందుకే ఈ ప్రదేశం ప్రపంచ ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంత గొప్ప పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడిని పూజిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. శనివారం రోజున భక్తుల సంఖ్య 77,848 నమోదు కాగా, అందులో దేవునికి 39,317 మంది తలనీలాలు సమర్పించారు. ఆరోజున తిరుమల దేవస్థానంలో టీటీడీ ఆదాయం దాదాపు 2.95 కోట్లు అందింది.
స్వామివారి దర్శనానికి సర్వదర్శన టోకెన్లు (Tokens) తీసుకున్న భక్తులకు స్వామీ వారి దర్శనం అయ్యేసరికి దాదాపు 12 గంటల సమయం పట్టింది. వేసవి ని దృష్టిలో పెట్టుకొని తిరుమల వెయిట్‌లు మరియు కంపార్ట్‌మెంట్లలో ఆహారం, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం మరియు వైద్య సదుపాయాలు అన్ని వేళలా అందుబాటులో అందేలా చూసారు.
ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయ వీధులు, భక్తులు అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో నిత్యం షెడ్లు, కూలెంట్లు, నీరు (Water) చల్లుతున్నారు. క్యూ లైన్, కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులకు నీళ్లు, మజ్జిగ ఇస్తున్నారు.
జూన్ 1 నుంచి 5 వరకు ఆకాశ గంగ సమీపంలోని బాలాంజనేయ స్వామి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, ఈడో మైలులోని ప్రసన్నాంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 2న ధర్మగిరిలోని సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం, నాద నీరాజనం వేదికలపై ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు.
మే 17-19 తేదీల్లో తిరుమల (Tirumala) లో పద్మావతి పరిణయోత్సవం, మే 22న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుచానూరు వార్షిక వసంతోత్సవం మే 21 నుండి 23 వరకు కొనసాగుతుంది. మే 28న స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. మే 23న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో పత్ర పుష్ప యాగం జరుగుతుంది.
శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవం మే 27 నుండి 29 వరకు జరుగుతుంది. మే 23న తిరుపతిలోని తాళ్లపాకలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య జయంతి వేడుకలు జరుగుతాయి. తిరుమల శ్రీవారికి వచ్చే భక్తులకు మేలు జరిగేలా టీటీడీ పనిచేస్తుందని ఈవో పేర్కొన్నారు. అందుకే కొండపై ఉన్న స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తుంది. టీటీడీ కార్యవర్గం అంతా యాత్రికులకు సేవలందించడానికే అంకితమైందని తెలిపారు.