Tirumala : తిరుమలలో రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్య , దర్శనానికి దాదాపు 20 గంటల

వేసవి సెలవులు ముగియడంతో, వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలు కడుతున్నారు. తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది.

Tirumala : తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు ముగియడంతో, వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలు కడుతున్నారు. తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. శనివారం సాయంత్రం వరకు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి పార్కులోని షెడ్లు నిండిపోవడంతో భక్తులు ఏటీసీ వరకు క్యూలో వేచి ఉండాల్సి వచ్చిందని టీటీడీ పేర్కొంది.

శనివారం ఉదయం రింగురోడ్డుపై శిలాతోరణాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. అయితే, VIP బ్రేక్ తరువాత, భక్తులను అన్ని దర్శనాలకు అనుమతించారు మరియు సాయంత్రం కొత్త కనిష్ట స్థాయికి రద్దీ తగ్గింది. రాత్రికి మళ్లీ సంఖ్య పెరగడంతో శిలాతోరణం వరకు క్యూ కట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం సర్వదర్శనం భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని శనివారం 78,686 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు మొత్తం రూ.3.54 కోట్లు వచ్చాయి. అదనంగా 37,888 మంది తలనీలాలు సమర్పించారు.

Tirumala

మరోవైపు తిరుమలలో శనివారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామలక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను ఉదయం 7 గంటలకు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి సమర్పించి ఆంజనేయస్వామివారి మూలవర్లు, సీతారామ, లక్ష్మణ స్వామివార్లకు అభిషేకం ఘనంగా నిర్వహించారు.

రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి హనుమాన్ రథంపై విహరించారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడి అంటారు. దాస్యభక్తికి గుర్తుగా శ్రీరాముడు హనుమంతుని వాహనంపై విహరిస్తాడు.

భక్తుల రద్దీతో వెంకన్న దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. రూ.300 ఖరీదు చేసే ప్రత్యేక దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.

Tirumala

Comments are closed.