Today Excellent OTT Movies: ఒక్కరోజే 3 హిట్ సినిమాలు ఓటీటీ లో ప్రసారం. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Today JoyFull OTT Movies: OTT ఫ్లాట్ ఫామ్ లో ఈరోజు 3 సిన8మాలు సందడి చేస్తున్నాయి. సూపర్ డూపర్ హిట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్న, ప్రేమలు, గామి మరియు ఓం భీమ్ బుష్ సినిమాలు ఒక్క రోజునే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. OTT ప్రేక్షకులకు ఈరోజు కనువిందు చే యనున్నాయి ఈ సినిమాలు.
Today Excellent OTT Movies:
Today Excellent OTT Movies: థియేటర్లలో కొత్త సినిమాలు ప్రతివారం సందడి చేస్తుంటాయి. సినీ ప్రేక్షకులు కూడా కొత్త సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తుంటారు. అలా విడుదలైన వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల మన్ననలు చూరగొని మంచి టాక్ తెచ్చుకు తెచ్చుకుని భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు అవుతాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఆడియెన్స్ సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. థియేటర్లలో సూపర్ డూపర్ హిట్స్ అయిన సినిమాలు ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతాయో అని తెగ ఎదురుచూస్తుంటారు. అలా బ్లాక్ బస్టర్ మూవీస్ కోసం ఎదురుచూసే వారి కోసం ఇప్పుడు ఏకంగా మూడు మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఒకే రోజు ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చాయి.
ఓటీటీ లో ప్రేమలు మూవీ
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి విడుదల అవుతున్న ఎన్నో సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంటాయి. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సినీ అభిమానులను ఎక్కువగా అలరించిన సినిమా ప్రేమలు. కొత్త తరం ప్రేమ కధగా వచ్చిన ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలో ఘన విజయాన్ని అందుకుంది. మలయాళంలో హిట్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేశారు. మార్చి 8న ప్రేమలు మూవీ తెలుగు వెర్షన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయగా తెలుగులో కూడా దానికి మంచి టాక్ వచ్చింది.
రెండు ఓటీటీ లలో ప్రేమలు
మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ప్రేమలు సినిమా ఏప్రిల్ 12న ఏక్ దమ్ రెండు ఓటీటీల్లోకి వస్తుంది. ప్రేమలు మూవీ మలయాళం, తమిళం, హిందీ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం అవుతుంది. తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చూడకుండా ఏమాత్రం వదిలిపెట్టకండి. ఈ సినిమా ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అవుతుందని రివ్యూలు తెలిపాయి.
గామి ఓటీటీ స్ట్రీమింగ్
మాస్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు పొందుతున్న యువ హీరో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే గామి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్నమైన కధాంశంతో విజువల్ వండర్ చిత్రంగా గామి ప్రేక్షకుల మన్ననలు పొందింది. దర్శకుడిగా విద్యాధర్ కాగిత తొలి సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులనుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం ఎలా ఉన్నా టాక్‌ను బట్టి సూపర్ హిట్ మూవీగా నిలిచింది.
మంచి ఎంపిక గామి
హిట్ చిత్రంగా నిలిచిన గామి, ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో శుక్రవారం నుంచి అంటే ఏప్రిల్ 12 నుంచి ప్రసారం అవుతుంది. నరేష్ కుమారన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంగీతం, నేపథ్య సంగీతం బ్రహ్మాండంగా ఉన్నాయని టాక్ వచ్చింది. ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. విభిన్నమైన సినిమా అనుభవం కావాలి అనుకున్న వారికి గామి ఒక బెస్ట్ ఆప్షన్.
నవ్వుతూ భయపెట్టే ఓం భీమ్ బుష్ ఓటీటీ
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ల కాంబినేషన్ లో గతంలో వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న బ్రోచేవారెవరురా సినిమా కాంబినేషన్ మరొక సారి రిపీట్ అయింది. పై ముగ్గురి కాంబినేషన్ లో నవ్వుల మ్యాజిక్ లో ప్రేక్షకులను ముంచిన సినిమా ఓం భీమ్ బుష్. హారర్ అండ్ కామెడీ జోనర్లో సాగిన ఈ చిత్రం, హుషారు, రౌడీ బాయ్స్ సినిమాలకు డైరెక్షన్ చేసిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వచ్చింది. ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల అయింది.
అస్సలు వదలకండి
హారర్ ని ఇష్టపడే వారికి కామెడీ సినిమా ప్రేమికులకు ఓం భీమ్ బుష్ మంచి ఛాయిస్. ఈ సినిమా మొత్తం నవ్వులతో నిండి మంచి హారర్ ఎఫెక్ట్స్‌తో హ్యాపీగా నవ్వుకోడానికి ఈ రోజు అంటే ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రసారం అవుతుంది. హారర్ ఎఫ్ఫెక్ట్స్ మరియు కామెడీ తో ఈ చిత్రం బాగుందని టాక్ తెచ్చుకుంది కనుక ఈ సినిమాని మిస్ అవకండి.
Comments are closed.