Today Gold Rates 07-04-2024 షాక్ కొడుతున్న బంగారం ధరలు, ఒక్క రోజులోనే తులం ధర ఎంత పెరిగిందంటే.
బంగారం ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ తో పాటు భారత విపణి వీధిలో కూడా పసిడి ధరలు అమాంతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. గోల్డ్ తో పాటు సిల్వర్ ధరలు కూడా పెరగడం గమనార్హం
Today Gold Rates 07-04-2024: బంగారం అంటే ఆసక్తి లేని వారు ఉండరు, అందునా భారతీయులకు అత్యంత ప్రీతి కలిగిన వస్తువు అంటే బంగారమే. భారతదేశంలో సాధారణ రోజులను వదిలేస్తే ముఖ్యమైన పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తారు. బంగారు ఆభరణాలను ధరించుకోవడం అంటే ఎంతో ఇష్టపడతారు మహిళలు. దానికి కారణం గోల్డ్ జువెలరీ ధరిస్తే వారి అందం, హోదా మరింత పెరుగుతుందని భావించడమే కారణం. అయితే ప్రస్తుతం బంగారం కొనాలంటే భయపడుతున్నారు, కారణం గోల్డ్ రేట్లు అంతటి స్థాయిలో పెరిగాయి. సామాన్యులకు అయితే బంగారం అందనంత ఎత్తులో ఉన్నది. సామాన్యులు కొనేందుకు గోల్డ్ కనుచూపుమేరలో అందుబాటులోనే లేదు. ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అయినాగానీ వడ్డీ రేట్లు తగ్గిస్తామని ఒక్క సంవత్సరం లో 3సార్లు సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రకటనతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి పోతున్నాయి. రోజురోజుకూ ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు అవుతున్నాయి. శనివారం రోజు తగ్గిన బంగారం ధర తిరిగి ఒక్కరోజులోనే రూ. 1300కుపైగా పెరగడం గమనించవలసిన విషయం.
అంతర్జాతీయ విపణి మార్కెట్ లో పసిడి రేట్లు చుక్కలు చూయిస్తోంది. గడచిన కొద్ది రోజుల తర్వాత స్పాట్ గోల్డ్ రేటు 2300 డాలర్లను దాటింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2330.15 డాలర్ల వద్ద నమోదయింది. మరోవైపు స్పాట్ సిల్వర్ ధర ఏకంగా 27.50 డాలర్లకు చేరడం విశేషం. ఇదిలా ఉండగా ఇంకో పక్క రూపాయి విలువ కూడా దిగజారుతుంది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి మారకం విలువ రూ. 83.298 గా ఉంది.
ఇక భారతదేశం విషయానికొస్తే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో గోల్డ్ ధర ఒక్క రోజులోనే వెయ్యికి పైగా పెరిగి 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.1200 పైకి చేరి తులం రూ. 65,350 దగ్గర ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ తులం ధర ప్రస్తుతం రూ. 1310 ఎగబాకింది, ఇప్పుడు 24 క్యారట్ల పసిడి 10 గ్రాములకు రూ. 71,290 మార్కుకు చేరింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధర చుక్కలు చూపెడుతోంది. డిల్లీలో తులం బంగారం ధర ఒక్క రోజులోనే రూ.1200 పెరగడం వలన 22 క్యారెట్ల పసిడి ధర 65,500 మార్కుకు ఎగబాకింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1310 కి ఎగసి రూ.71,440 గా నమోదయింది.
గోల్డ్ ధరలను అనుసరించే వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండిపై రూ.1800 పెరిగి ఇప్పుడు రూ. 83,500గా నమోదయింది. హైదరాబాద్‌లో వెండి ధరను గమనిస్తే కేజీ వెండి రూ.1800 దగ్గరకు ఎగబాకి ప్రస్తుతం రూ. 87 వేలకు ఎగసింది. ఈ మధ్య కాలంలో వెండి ధరలు రూ. 600, రూ. 400, రూ. 2000, రూ. 1000 చొప్పున పెరుగుకుంటూ పోవడం సిల్వర్ మార్కెట్ లో ఆందోళన కలిగిస్తోంది.
Today Gold Rates 07-04-2024
Comments are closed.