Telugu Mirror : బంగారం కొనాలనే ఆలోచనల్లో ఉన్నారా? అయితే బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఈరోజు శుభవార్త . వరుసగా మూడో రోజు కూడా భారీగా ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 300 తగ్గగా, 24 క్యారట్ల బంగారం పై రూ.330 తగ్గింది. సుమారు రూ.820 వరకు బంగారం ఈ మూడు రోజుల్లో తగ్గుముఖం పట్టింది.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 550 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,770 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,620 నమోదయింది.
ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,800 నమోదయింది. మరి, అదే చెన్నై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,050గా నమోదయింది.
Also Read : Gold Rates Today : బంగారం కొనాలని చూస్తున్నారా ? మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
తగ్గిన వెండి ధరలు :
వెండి ధర కూడా దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో వెండి పై రూ.400 వరకు తగ్గింది.మూడు రోజుల్లో వరుసగా రూ.1300 తగ్గుముఖం పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో అనగా హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ. 77,000గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, బెంగుళూరులో కిలో వెండిపై రూ.750 వరకు తగ్గి ప్రస్తుతం బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 73,000 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,400 నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,620 గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనితో పాటు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.